Begin typing your search above and press return to search.

దారుణం... భార్య వేధింపులకు సింగర్ సూసైడ్!

ఇటీవల కాలంలో భార్యబాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందనే చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Feb 2025 5:30 PM GMT
దారుణం... భార్య వేధింపులకు  సింగర్  సూసైడ్!
X

ఇటీవల కాలంలో భార్యబాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందనే చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. జీవిత భాగస్వామే మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు చాలా మంది భర్తలు! ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక మూల తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఆ జాబితాలో తాజాగా ఓ సింగర్ చేరారు!

అవును... ఆ మధ్య అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య పెట్టే బాధలు బరించలేక బలవన్మరణం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాటకలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్థాన్ లో అజయ్, ఢిల్లీలో పునీత్ ఇలా... చెప్పుకుంటూ పోతే భార్యల కారణంగా బలవన్మరణం చేసుకున్న బాధితులు ఎందరో!

ఈ క్రమంలో తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ చేరినట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన అభినవ్ సింగ్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అభినవ్ సింగ్ తండ్రి బిజయ్ నందా సింగ్... తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా... అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రధానంగా కథక్ అంథెమ్ సాంగ్ తో మరింత పాపులర్ అయ్యాడు.