మూడవ అంతస్తు నుంచి జారి పడి పాప్ సింగర్ మృతి!
ప్రముఖ పాప్ సింగర్ లియామ్ పైన్ (31) దుర్మరణం చెందారు. బ్యూనస్ ఎయిర్ పోర్టులోని ఓ హోటల్ బాల్కనీ లోని మూడవ అంతస్తు నుంచి జారి కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు.
By: Tupaki Desk | 17 Oct 2024 5:07 AM GMTప్రముఖ పాప్ సింగర్ లియామ్ పైన్ (31) దుర్మరణం చెందారు. బ్యూనస్ ఎయిర్ పోర్టులోని ఓ హోటల్ బాల్కనీ లోని మూడవ అంతస్తు నుంచి జారి కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఓలైవ్ కన్సర్ట్ లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతికి గురయ్యారు.
లండన్ కు చెందిన లియామ్ పైన్ వన్ డైరెక్షన్ పాప్ బ్యాండ్ తో పేరు సంపాదించారు. హార్రీస్టైల్స్, జేన్ మాలిక్, నియాల్ హోరన్, లూయిస్ టామ్లిన్ సన్ తోకలసి ఆనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈనేపథ్యంలో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ ఘటన సమయలో లియామ్ స్నేహితురాలు కేట్ కాసిడి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుదినం సందర్భంగా సోషల్ మీడియా కొన్ని పోస్ట్‌లను పంచుకున్నారు.
వారు మధ్యాహ్నం 1 గంటల వరకు నిద్రపోతున్నారని, గుర్రపు స్వారీకి వెళుతున్నారని , స్థానిక వంటకాలను ఆస్వాది స్తున్నారని వెల్లడించారు. ఇవన్నీ స్నాప్‌చాట్‌లలోని ఘటన జరగడానికి ఒక గంట ముందు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడేళ్ల క్రితం `ది డైరీ ఆఫ్ ఎ సియో పోడ్‌కాస్ట్` లియోమ్ పేన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను `వన్ డైరెక్షన్`లో ఉన్న సమయంలో తీవ్రమైన ఆత్మహత్య ఆలోచనలను అనుభవించానని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో మళ్లీ మద్యం వైపు మొగ్గు చూపుతున్నానని పేన్ చెప్పుకొచ్చాడు.
తన మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదని అన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లియోమ్ పైన్ గత వ్యాఖ్యలకు...ఈ ఘటనకు ఏదైనా సంబందం ఉందా? లేక ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న ఘటన అన్నది నిర్దారణకు రావాల్సి ఉంది. లియోమ్ పాన్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే హాలీవుడ్ పాప్ గాయకులుంతా సంతాపం ప్రకటించారు.