ఏపీలో గత ప్రభుత్వ లిక్కర్ అక్రమాలపై కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది.
By: Tupaki Desk | 6 Feb 2025 6:46 AM GMTఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ విషయంలో అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని కూటమిలోని పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది.
అవును... గత ప్రభుత్వ హాయమలో ఏపీలోని లిక్కర్ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించిన వేళ.. తాజాగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మరో ఆరుగురు సభ్యులతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
వాస్తవానికి గత ప్రభుత్వ హయంలో లిక్కర్ పాలసీలో పలు అక్రమాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గత ఏడాది సెప్టెంబర్ లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సమయంలో ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ పర్యవేక్షణ, నియంత్రణలోనే సిట్ పనిచేయనుందని అంటున్నారు.
ఈ స్పెషల్ ఇన్వెస్టిగెషన్ టీమ్ కు అన్ని ప్రభుత్వ శాఖలూ సహకరించాలని.. దర్యాప్తు పురోగతిపై ప్రతీ 15 రోజులకు ఒకసారి తమకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
కాగా... గత ప్రభుత్వ హయాంలో.. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు ఏవీ మార్కెట్ లో కనిపించకుండా చేశారని.. వాటిని ఓ ప్లాన్ ప్రకారం అణగదొక్కేశారని.. మాన్యువల్ విధానం ద్వారా మద్యం కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే!
సిట్ లోని అధికారుల వివరాలు!:
సిట్ అధిపతి - ఎస్వీ రాజశేఖర్ బాబు - విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్
సభ్యుల వివరాలు:
ఎల్. సుబ్బారాయుడు - ఎస్పీ - ఎర్రచంద్రనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్
కొల్లి శ్రీనివాస్ – రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ - ఒంగోలు
ఆర్. శ్రీహరిబాబు - అడిషనల్ ఎస్పీ - సీఐడీ
పి. శ్రీనివాసరావు - డీఎస్పీ - డోన్
కే. శివాజీ - ఇనిస్పెక్టర్
సీహెచ్. నాగశ్రీనివాస్ - ఇనిస్పెక్టర్