Begin typing your search above and press return to search.

ఆ ఆరుగురు మంత్రులు ఎవరు? కీలకమైన ఆ శాఖలు ఎవరికి?

ప్రస్తుతం సీఎం రేవంత్ మరో 11 మంది మంత్రులు కొలువు తీరారు. అంటే.. మరో ఆరుగురికి అవకాశం ఉంది. మరి.. ఆ ఆరుగురు ఎవరు?

By:  Tupaki Desk   |   8 Dec 2023 3:30 PM GMT
ఆ ఆరుగురు మంత్రులు ఎవరు? కీలకమైన ఆ శాఖలు ఎవరికి?
X

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అసలు సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అతిశయం కాకుంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ చేతికి పవర్ వచ్చే సీనే లేదు. ఆ మాటకు వస్తే.. పట్టుమని పాతికసీట్లలో గెలిచే నేతలు ఎవరు? లాంటి మాటలు రెండు నెలల ముందు ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేవే. ఎన్నికల నోటిఫికేషన్ ముందు కూడా ఒక మోస్తరు బలంగా మాత్రమే ఉన్న కాంగ్రెస్.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి వాయు వేగంతో పుంజుకోవటంతో పాటు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఒకటి తర్వాత ఒకటి చొప్పున అన్నీ కలిసి వచ్చేలా పరిస్థితులు కాంగ్రెస్ కు చోటు చేసుకుంటే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాటి అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు.. అపశకునాలు ఎదురైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్.. ఆయనమంత్రులు కొలువు తీరటం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా.. రేవంత్ తో సహా కేబినెట్ లోకి 18 మందికి అవకాశం ఉంది.

ప్రస్తుతం సీఎం రేవంత్ మరో 11 మంది మంత్రులు కొలువు తీరారు. అంటే.. మరో ఆరుగురికి అవకాశం ఉంది. మరి.. ఆ ఆరుగురు ఎవరు? వారికి కేటాయించే శాఖలేంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. శాఖలు కొన్నింటిని కేటాయించినట్లుగా ప్రకటించినా.. అలాంటిదేమీ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అదే సమయంలో.. కీలకమైన శాఖలు ఎవరికి కేటాయింపులు చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణకు దిక్సూచి లాంటి ఐటీ శాఖ రేవంత్ వద్ద ఉందని ప్రచారం జరుగుతుంటే.. కాదు.. కోమటిరెడ్డికి కేటాయించారని చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థల రిపోర్టుల్లో ఐటీని కోమటిరెడ్డికి కేటాయించినట్లుగా ప్రచారం సాగింది.అయితే.. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్దే ఉందని.. ఆ కీలకపోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు కూలిపోయిన తర్వాత ఐటీ శాఖ మీదా.. దానికి మంత్రిగా ఎవరు ఎంపిక అవుతారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలోనూ బోలెడన్ని కథనాలు వచ్చాయి. కొందరు నేతలు ఆ శాఖకు అర్హులు అంటూ ప్రచారం సాగింది. హైదరాబాద్ ఐటీని మరోస్థాయికి తీసుకెళ్లటంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారని.. కేటీఆర్ ను రీప్లేస్ చేసే సత్తా ఉన్న నేత ఎవరన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో హైదరాబాద్ నుంచి ఒకరిని.. మైనార్టీ నుంచి మరొకరిని ఖాయంగా తీసుకుంటారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని చెబుతున్నారు. రెండు ఖాళీల్ని అట్టి పెడతారని.. అవసరానికి తగ్గట్లు వాటిని ఉంచేస్తారని చెబుతున్నారు. ఇక.. కేటాయించని ముఖ్యమైన శాఖల విషయానికి వస్తే.. ఐటీ.. విద్యాశాఖ.. విద్యుత్.. పంచాయితీరాజ.. రవాణా.. కార్మిక.. వ్యవసాయ.. దేవాదాయ.. సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. వీటిని ఎవరికి కేటాయిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.