Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్‌ పై స్పందించిన అఖిలేష్... షాకిచ్చిన బీజేపీ నేత!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Sep 2023 12:23 PM GMT
బాబు అరెస్ట్‌ పై స్పందించిన అఖిలేష్... షాకిచ్చిన బీజేపీ నేత!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టును, అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ పలు రాజకీయ పార్టీలు, పలువురు కీలక నేతలూ స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అఖిలేష్ స్పందించారు.

అవును... ఏపీలో అవినీతి కేసులో అరెస్టై, సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు అనుకూలంగా "ఇండియా" కూటమి నేతలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. చంద్రబాబు అరెస్ట్‌ పై స్పందించారు.. అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఈ క్రమంలో మరో నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ పై తాజాగా యూపీ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌ గా మారింది.. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానం.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదు" అని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... "రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలి. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదు" అని చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు అరెస్ట్‌ పై స్పందించిన "ఇండియా" కూటమిలోని రెండవ నేత అఖిలేష్ యాదవ్ అయ్యారు.

అయితే... చంద్రబాబు అరెస్టు బీజేపీ ప్రోద్భలంతో జరిగిందన్నట్లుగా అఖిలేష్ యాదవ్ ట్వీట్ ఉండటంతో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ అధికార పార్టీ కాదని ప్రతిపక్షంలో ఉందన్న సంగతి అఖిలేష్ యాదవ్ తెలుకోవాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ అన్నట్లుగా నిజంగా బీజేపీ ఇలా చేసి ఉండేదే అయితే.. మీరు ఇలా ట్వీట్ చేయగలిగే వారు కాదని, ఉత్తరప్రదేశ్‌ లోని ఏదో ఓ జైల్లో ఉండేవారని సైటైర్ వేశారు.

వీరి క్లారిటీ ఇలా ఉంటే... ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుని కనీస ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేశారని ఖండించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీ కీలక నేత , రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఇదే సమయంలో టి.బీజేపీ చీఫ్ మాత్రం... ఇంకా డాక్యుమెంట్స్ చదవలేదు.. అరెస్టు విషయం తెలిసింది అని అన్నారు.

వీరి అభిప్రాయాలు ఇలా ఉంటే... అఖిలేష్ యాదవ్ మాత్రం బీజేపీ ప్రోద్భలంతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నట్లుగా ప్రకటించడంపై ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ రేంజ్ లో ఫైరవుతున్నారు.