Begin typing your search above and press return to search.

స్లీప్ డివోర్స్ అంటే ఇదేనా?

వైవాహిత జీవితంలో భార్యాభర్త కలిసి తమ శృంగార జీవితంలోని మదురానుభూతులను పొందాలని తపిస్తుంటారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:17 AM GMT
స్లీప్ డివోర్స్ అంటే ఇదేనా?
X

మావిడాకులు అనంతరం కొన్ని జంటల్లో విడాకులు ఉంటాయనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తాజాగా ఈ విడాకుల ప్లేస్ లోకి నిద్ర విడాకులు (స్లీప్ డివోర్స్) వచ్చాయి. ప్రస్తుతం ఈ తరహ విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతుందని తెలుస్తుంది. దీంతో అసలు ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి.. ఎందుకు ఇలా జరుగుతుంది.. పరిష్కారాలు ఏమిటి మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం చాలా మంది దంపతుల్లో ఈ సమస్య మొదలైందని అంటున్నారు. ఈ స్లీవ్ డివోర్స్ అంటే వారి వివాహాన్ని రద్దు చేసుకుని విడిపోయినట్లు కాదు సుమా... ఒకే ఇంట్లో ఉంటూ, కుదిరితే ఒకే గదిలో ఉంటూ, ఒకే మంచంపై కూడా ఉంటూ... దూరంగా ఉంటారన్న మాట. ఇదే స్లీప్ డివోర్స్ అంటే! అయితే దీనికి అనేకరకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు!

వైవాహిత జీవితంలో భార్యాభర్త కలిసి తమ శృంగార జీవితంలోని మదురానుభూతులను పొందాలని తపిస్తుంటారు. రాత్రి అయితే చాలు అలాంటి అలోచలనతో తమ భాగస్వామికి సంకేతాలు పంపుతుంటారు. ఇక పెళ్లైన కొత్తలో అయితే చెప్పే పనేలేదు. వీలైనంత ఏకాంత దొరికితే వైవాహిక జీవితాన్ని రసవత్తరంగా అనుభవిస్తుంటారు. అయితే రాను రానూ... ఈటైపు లైఫ్ దూరం అయిపోతుందని అంటున్నారు.

సాధారణంగా ఈ స్లీప్ డివోర్స్ అనేవి... నిజమైన విడాకులు తగ్గుముఖం పట్టడానికి కూడా హెల్ప్ అవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా భార్యా భర్త వేరు వేరు గదుల్లో పడుకుంటుంటే... విడాకులకు ఇది మొదటి స్టెప్ అనే భావన ఉంటుంది. అయితే ఈ స్లీప్ డివోర్స్ వల్ల వీరిద్దరూ పడుకోవడం మాత్రమే విడి విడిగా తప్ప... మిగిలినవన్నీ రెగ్యులర్ గానే ఉంటాయని, పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు రొటీన్ గానే ఉంటాయని చెబుతున్నాఉర్.

సాధారణంగా కలిసి పడుకునే సమయాల్లో కొందరికి కొన్ని రకాల వ్య్యక్తిగత అలవాట్లు ఉండటం వల్ల అవి భాగస్వామికి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంటాయి. ఉదాహరణకు గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దిండుని కౌగిలించుకొని పడుకోవడం, అర్థరాత్రి వరకూ టీవీ చూడటం, సోషల్ మీడియా లో బిజీగా ఉండటం వంటివి కొందరు చేస్తుంటారు.

అయితే ఇలాంటి పనులు, అలవాట్లు భాగస్వామికి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలా అని ఈ చిన్న కారణాలతోనే బంధాన్ని నాశనం చేసుకోకుండా... కావ్సాలిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. నిద్ర విడాకులు తీసుకుని.. ఎవరి గదుల్లో వారు పడుకుంటారన్న మాట! దీనివల్ల ఎవరి అలవాట్లను వారు కాపాడుకుంటూనే... ప్రశాంతంగా రాత్రులు లైట్లు ఆపుకుని పడుకోవాలని అనుకునేవారు ఆ పనుల్లో ఉంటారు.. టీవీ చూడాలనుకునేవారు ఆ పనిలో ఉండొచ్చు!

అయితే చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకూ వెళ్లే జంటలకు ఈ స్లీప్ డివోర్స్ మంచి ఔషదంగా పనిచేసుందని అంటున్నారు నిపుణులు! ఈ స్లీప్ డివోర్స్ అనేవి బంధం పూర్తిగా దూరం కాకుండా. బంధంలోని మధుర్యాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గం అని చెబుతున్నారు. స్లీప్ విడాకులు అంటే ఒకే మంచంలో కొంత సమయం గడపలేకపోవడం కాదు.. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుడా కొన్ని గంటల పాటు మంచి నిద్రను పొందాలనుకోవడం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు.