నగ్నంగా నిద్రపోతే... తెలుసుకోవాల్సిన విషయం ఇది!
సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి గల లక్షణాల్లో రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం ఒకటని చెబుతుంటారు
By: Tupaki Desk | 3 Oct 2023 4:30 PM GMTసాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి గల లక్షణాల్లో రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం ఒకటని చెబుతుంటారు. అంత సమయం నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సిన విశ్రాంతి దొరుకుతుందని చెబుతారు. అయితే ప్రస్తుత ఆధునిక జీవన శైలికి తోడు చేస్తున్న ఉద్యోగాల ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్య వేధిస్తుంది. మరికొంతమందికి నిద్రపోవాలన్నా సమయం సహకరించకున్నది.
సరే అవకాశం దొరికిన కాసేపైనా నిద్రపోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధరించాల్సిన దుస్తులు మొదలగు విషయాలను ఒక సారి చర్చిద్దాం. నిద్రపోయే సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదని, వీలైనంత వదులుగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతుంటారు. అదే విధంగా బెడ్రూంలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవాలని అంటారు.
ఎప్పుడైతే పడకగదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉంటుందో... అప్పుడు మరింత హాయిగా నిద్రపడుతుంది. ఈ సమయంలో వదులుగా ఉండే దుస్తులు, బిగుతుగా ఉండే దుస్తులు అనే సమస్య లేకుండా... పూర్తి నగ్నంగా పడుకుంటే ఏమవుతుంది అనే విషయంపై ఆన్ లైన్ వేదికగా తెగ సెర్చ్ నడుస్తుంది. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారనేది ఇప్పుడు చూద్దాం!
ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా పడుకోవడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుందట. ఇదే సమయంలో బట్టలు లేకుండా పడుకోవడం వల్ల శరీరానికి సహజసిద్దమైన వాతావరణం తాకడం వల్ల చర్మ మృదువుగా, హెల్తీగా మారడంతోపాటు చర్మ సంబంధిత వ్యాధులు కూడా నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు!
ఇలా రాత్రంతా బట్టలు విప్పి పడుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయని.. అదే సమయంలో లైంగిక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారని తెలుస్తుంది. ఫలితంగా శారీరాక ఆరోగ్యం, చర్మ సౌదర్యంతో పాటు లైంగిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.