Begin typing your search above and press return to search.

అతినిద్ర ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి?

మనిషికి సరైన నిద్ర అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాల్సిందే. మీరు సరిగా నిద్రపోవడం లేదంటే మీకు అనారోగ్యం దరిచేరినట్లే.

By:  Tupaki Desk   |   4 April 2024 10:30 AM GMT
అతినిద్ర ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి?
X

మనిషికి సరైన నిద్ర అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాల్సిందే. మీరు సరిగా నిద్రపోవడం లేదంటే మీకు అనారోగ్యం దరిచేరినట్లే. ఈ పరిస్థితుల్లో సరైన నిద్ర పోయేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే. మంచి నిద్ర లేకపోతే మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అనేక రోగాలు చుట్టుముడతాయి. దీని వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

రెగ్యులర్ గా అతిగా నిద్రపోతున్నారంటే కూడా మీ ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలుసుకోవాలి. గాఢమైన నిద్రలో మన శరీర అవయవాలు విశ్రాంతి తీసుకుంటే మరుసటి రోజు మరింత ఉత్సాహంతో పనిచేస్తాయి. లేదంటే అవి కూడా మొరాయిస్తాయి. దీంతో మనిషి ఆరోగ్యం పాడై పోవడం ఖాయం. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మన ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర అత్యవసరమే.

అతిగా నిద్రపోవం, తాత్కాలిక యాంగ్జైటీ, ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత రోగాలు రావడానికి నిద్ర లేకపోవడం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. అతినిద్ర మతిమరుపుకు కూడా దారి తీస్తుంది. ఇలా నిద్ర వల్ల మనకు వచ్చే ముప్పు అధికంగానే ఉంటుంది. దీంతో నిద్ర సరిగా పోవడానికి అవసరమయ్యే చర్యలు తీసుకోవడం మంచిది. అందుకే నిద్రకు ప్రాధాన్యం ఇస్తేనే మంచిది.

నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది. శరీర భాగాలు సరైన విశ్రాంతి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. గదిలో సరైన వాతావరణం లేకపోతే కూడా నిద్ర సరిగా పట్టదు. మనకు నిద్ర రావడానికి పనికొచ్చే చిట్కాలు పాటించి నిద్ర పోయేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మన దేహం మంచి దారుఢ్యంగా ఉంటుంది. మన ఆరోగ్యం మెరుగవుతుందని గుర్తుంచుకోవాలి.