ఈ చిన్న తేడానే.. జగన్‌ను డైల్యూట్ చేసింది..!
ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇలానే ఉంది. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం అంటూ ఏదీ లేదు.
By: Tupaki Desk | 28 March 2025 6:30 PMరాజకీయాల్లో ఉన్న నాయకులు ఆచి తూచి అడుగులు వేయాలి. లేకపోతే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే కాదు.. అంధకారం కూడా అయిపోతుంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇలానే ఉంది. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం అంటూ ఏదీ లేదు. దీనికి కారణం.. చిన్న తేడా! ఔను.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానం చూస్తే.. ఆ తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. 30 ఏళ్లు అధికారం మాదేనని తేల్చి చెప్పారు.
దీంతో నాయకులు విర్రవీగారు. అంతేకాదు.. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం .. భూకబ్జాలు పెరిగిపోయాయన్నది నిష్టుర సత్యం. అయితే.. దీనిని అక్కడే కట్ చేయాల్సిన జగన్.. ప్రభు త్వం మనదే.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం .. తద్వారా నాయకులను ప్రోత్సహిం చడం వంటివి పార్టీకి మేలు చేయకపోగా.. కీడునే చేశాయన్నది వాస్తవం. ఇది దీర్ఘకాలంలో పార్టీని నాశనం చేసింది. అంతేకాదు.. న్యూడ్ కాల్‌తో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. చికాకు తెచ్చిన అప్పటి ఎంపీని వెనుకేసుకురావడం కూడా.. మైనస్ అయింది.
ఇక, డాక్టర్ సుధాకర్ వ్యవహారం పరాకాష్ఠకు చేరింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను హైకోర్టు మెట్టెక్కేలా చేసిం ది. దీనికి కారణం.. వచ్చే 30 ఏళ్లపాటు మేమే అధికారంలో ఉంటామన్న ఏకైక ధీమా. కానీ, ఇది తిరగ బడింది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు హయాంను పరిశీలిస్తే.. వచ్చే 15 ఏళ్లపై ధీమా ఉంది. ఇది పార్టీలోనూ అందరికీ తెలుసు. కూటమి కట్టి.. పార్టీలను ముందుకు నడిపిస్తున్న జనసేన.. ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 15 ఏళ్లకు తిరుగులేదన్నదివాస్తవం.
అయినప్పటికీ.. ఎక్కడా ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవ హరిస్తున్నారు. ఈ అంతేకాదు.. నాయకులను అదుపులో కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను కూడా కట్టడి చేస్తున్నారు. ఎవరినీ భుజాలపై వేసుకోవడం లేదు. ఎక్కడ నాయకులు రెచ్చిపోతున్నారో.. అక్కడ స్వయంగా జోక్యం చేసుకుని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. పలితంగా పార్టీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిన్న తేడానే జగన్‌ను డైల్యూట్ చేసేసింది.