పౌరసత్వంతో వ్యాపారం.. అద్భుతాలు సృష్టిస్తున్న చిన్న ద్వీపం..
ఇదంతా అక్కడ టూరిజంను తిరిగి డెవలప్ చేయడానికి ఆ దేశం చేస్తున్న ఓ చిన్ని ప్రయత్నం.
By: Tupaki Desk | 6 Oct 2024 2:30 AM GMTఅందమైన ఐలాండ్.. చుట్టుపచ్చని ప్రకృతి.. తీరని తాకే అలలు.. ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఉండే అవకాశం మీకు వస్తే ఏం చేస్తారు? మీరు వింటున్నది నిజమే నా అందమైన కరేబియన్ ఐలాండ్ దేశం డొమినికా తమ దేశ పాస్పోర్ట్లను అమ్మకానికి పెట్టింది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అక్కడికి వెళ్లే విధంగా పాస్పోర్ట్ లు కొనుక్కోవచ్చు. ఇదంతా అక్కడ టూరిజంను తిరిగి డెవలప్ చేయడానికి ఆ దేశం చేస్తున్న ఓ చిన్ని ప్రయత్నం.
ఏడు సంవత్సరాల క్రితం మారియా హరికేన్ డొమినికాలో ప్రళయాన్ని సృష్టించింది. అప్పటి విధ్వంసం నుంచి దెబ్బతిన్న ఐలాండ్ ను మెల్లిగా పునర్నిర్మించుకోవడానికి విభిన్న రీతులలో ఆ దేశం నిధుల సమీకరణ కోసం కృషి చేస్తోంది. ప్రకృతి బీభత్సాన్ని తట్టుకొని నిలబడిన అత్యంత దృఢమైన.. అద్భుతమైన ఐలాండ్ గా తిరిగి మారడానికి డొమినికా ఎంతో ప్రయత్నిస్తోంది.
అయితే ఇలా చేయడం కోసం కొత్తగా అప్పులు చేసి మరింత సంక్షోభాన్ని సృష్టించకుండా ఎంతో తెలివిగా స్వంతంగా డబ్బులు సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే తమ దేశ పౌరసత్వాన్ని చైనా,
మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ధనవంతులకు పాస్పోర్ట్ రూపంలో అమ్మకానికి పెట్టింది. 90 ల నుంచి ఆ దేశ పౌరసత్వ ప్రధాన కార్యక్రమం నడుస్తున్నప్పటికీ హరికేన్ తర్వాత ఇది మరింత వేగవంతం అయ్యింది.
ఇప్పుడు ఇదే ఒకరకంగా ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. అయితే వస్తున్న ఈ నిధులతో దేశంలో అవసరమైనటువంటి కొత్త మెడికల్ క్లినిక్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లాంటి నిర్మాణాలు.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమం తమకు ఒక స్వయం స్వతంత్ర ఫైనాన్సింగ్ గా ఉపయోగపడుతోంది అని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్ఇన్ప్లర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ దేశ పౌరసత్వ కనీస ధర 2 లక్షల డాలర్లు.. అంటే అక్షరాల మన కరెన్సీలో ఒక కోటి 68 లక్షలు. ప్రస్తుతానికి 70 ఒక్క వేల జనాభా కలిగిన ఈ చిన్న ద్వీపంలో పౌరసత్వ హక్కుల పొందిన వారు కొంతమంది నివాసం ఉంటున్నారు. మరి కొంతమంది సీజనల్ గా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. మొత్తానికి సొంతంగా డబ్బులు సంపాదించడానికి ఈ ద్వీపం చేస్తున్న పని ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.