Begin typing your search above and press return to search.

స్మార్ట్ టీవీ సరఫరాలు తగ్గుతున్నాయి.. అసలు కారణమిదే

ఈ రిపోర్టు అంచనా ప్రకారం ఈ క్యాలెండర్ ఇయర్ (జనవరి - డిసెంబరు)లో టీవీల సరఫరాల్లో 10 శాతం క్షీణత నమోదయ్యే వీలుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 5:48 AM GMT
స్మార్ట్ టీవీ సరఫరాలు తగ్గుతున్నాయి.. అసలు కారణమిదే
X

ఇవాళ ఎక్కడ చూసినా స్మార్ట్ టీవీలే. గడిచి పదేళ్లలో స్మార్ట్ టీవీల వినియోగం పెరగటమే కాదు.. ఈ రంగంలోని బోలెడన్ని కంపెనీలు వచ్చి చేరాయి. అయినప్పటికీ కొన్ని బ్రాండ్లకు ఉన్న ఆదరణ ఇతర బ్రాండ్లకు లేదన్న విషయమే కాదు.. ఇటీవల కాలంలో కంపెనీలు స్మార్ట్ టీవీల ఉత్పత్తిని తగ్గించిన కొత్త విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి విడుదలైన ఒక రిపోర్టులోని అంశాలు ఆసక్తికరంగా మారాయి.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ టీవీల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. జనవరి - మార్చి మధ్య దాదాపు 14 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. వినియోగదారు నుంచి డిమాండ్ స్తబ్దుగద ఉండటం.. ఇప్పటికే డీలర్ల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు ఉండటంతో ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ రిపోర్టు అంచనా ప్రకారం ఈ క్యాలెండర్ ఇయర్ (జనవరి - డిసెంబరు)లో టీవీల సరఫరాల్లో 10 శాతం క్షీణత నమోదయ్యే వీలుందని చెబుతున్నారు.

ఇక.. ఈ రిపోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఏయే బ్రాండ్లను మన వినియోగదారులు ఎక్కువగా ఆదరణిస్తున్నారు? వినియోగదారుల అభిరుచి ఎలా ఉంది? లాంటి అంశాల్ని చూస్తే..

- మొదటి మూడు నెలల కాలంలోని అమ్మకాలను చూస్తే చైనా కంపెనీలకు చెందిన టీవీల కంటే శామ్ సంగ్ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. చైనా బ్రాండ్ల స్మార్ట్ టీవీల సరఫరాలు 30 శాతం క్షీణించాయి.

- వన్ ప్లస్.. హైయర్.. రియల్ మీ బ్రాండ్ల స్మార్ట్ టీవీలు బాగా తగ్గాయి. శామ్ సంగ్ సరఫరాలు 40 శాతం పెరిగాయి.

- దేశీయ కంపెనీల స్మార్ట్ టీవీల సరఫరాలు 16 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా కంపెనీ ఎల్ జీ సరఫరాలు 43 శాతం పెరిగాయి.

- దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ లో ఎల్ జీకి 15 శాతం వాటా ఉంది.

- చైనా బ్రాండ్లు ఎంఐ.. టీసీఎల్ కంపెనీల సరఫరాలు వరుసగా 2, 4 శాతం క్షీణతను నమోదు చేశాయి. దేశీయ మార్కెట్ లో వీటి వాటా 12, 7 శాతం చొప్పున ఉంది.

- సోనీ కంపెనీ స్మార్ట్ట్ టీవీ సరఫరాలు 19 శాతం పెరిగాయి. దేశీయంగా ఈ కంపెనీకి 7 శాతం వాటా ఉంది.

- వినియోగదారుల అభిరుచిని చూస్తే.. అందరికి తెలిసిన బ్రాండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. శామ్ సంగ్.. ఎల్ జీ.. షియోమీ బ్రాండ్ల స్మార్ట్ టీవీలకు గిరాకీ ఉంది. తొలి త్రైమాసికంలో టాప్ 5 కంపెనీల వాటా 57 శాతం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 41 శాతమే ఉంది. ఈ లెక్కన చూస్తే.. బ్రాండెడ్ స్మార్ట్ టీవీలకు ఆదరణ పెరిగింది.