Begin typing your search above and press return to search.

ట్రంప్ ఏఐ సలహాదారు శ్రీరామ్ పై ఆన్ లైన్ లో పెరుగుతున్న దాడులు!

ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... శ్రీరామ్ కృష్ణన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ మొదలైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 7:25 AM GMT
ట్రంప్ ఏఐ సలహాదారు శ్రీరామ్ పై ఆన్ లైన్ లో పెరుగుతున్న దాడులు!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి.. త్వరలో అగ్రరాజ్యం అధినేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్.. తన టీమ్ ని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... భారత సంగతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ ను తన సలహాదారుల బృందంలో ఒకరిగా నియమించుకున్నారు.

వ్యాపారవేత్త, స్టార్టప్ సంస్థల పెట్టుబడిదారు, రచయిత అయిన శ్రీరామ్ కృష్ణన్.. ట్రంప్ బృందంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... శ్రీరామ్ కృష్ణన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ మొదలైందని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఏఐ సలహాదారుగా నియమితులైన ఇండియన్ అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్ కృష్ణన్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానంగా ట్రంప్ కు మద్దతు పలికిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన (ఎంఏజీఏ) బేస్ లో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు.

వాస్తవానికి గతంలో.. గ్రీన్ కార్డులపై దేశ పరిమితులను తొలగించాలని, హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ను విస్తరించాలని శ్రీరామ్ కృష్ణన్ వాదించారని అంటారు. దీంతో... ఈ విధానాలు "అమెరికా ఫస్ట్" సూత్రాలను బలహీనపరుస్తాయని వాదన్లు వినిపించాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ వేదికగా కృష్ణన్ పై దాడులు మొదలయ్యాయని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ను వ్యతిరేకించే వారి నుంచి ఆన్ లైన్ లో దాడులు మొదలవ్వగా.. ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ ప్రచార వాగ్ధానాలకు విరుద్ధంగా కృష్ణ నియామకం జరిగిందని సోషల్ మీడియాలో తనదైన స్థాయిలో వాయిస్ వినిపించే కార్యకర్త లారా లూమర్ విమర్శించిన పరిస్థితి.

కాగా.. వైట్ హౌస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో సంబంధ వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ ఓ స్యాక్స్ తో కలిసి శ్రీరామ్ కృష్ణన్ పనిచేయనున్నారు. చెన్నైలో జన్మించిన ఈయన 2007లో మైక్రోసాఫ్ట్ లో ప్రోగ్రామ్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించి.. ట్విట్టర్, యాహు, ఫేస్ బుక్ సంస్థలకు నేతృత్వం వహించారు.