Begin typing your search above and press return to search.

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం... ఏడాదే సమయం!

ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేసింది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 10:08 AM GMT
16 ఏళ్ల లోపు వారికి సోషల్  మీడియా నిషేధం... ఏడాదే సమయం!
X

ప్రస్తుతం కాలంలో పిల్లలకు.. ఫోన్లకు, ఆ ఫోన్లలోని సోషల్ మీడియా అలవాట్లకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా.. ప్రధానంగా 16 ఏళ్ల లోపు పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం అని అంటున్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

అవును... పదహారేళ్ల వయసు దాటేవరకూ పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్‌ ఇటీవల బాగా ఊపందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా... 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా చూడకుండా నిషేధం విధించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో తాజాగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేదించడానికి "వరల్డ్ - లీడింగ్" చట్టాన్ని ప్రవేశపెడతామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్... సోషల్ మీడియా తమ పిల్లలకు హాని చేస్తోందని అన్నారు.

ఇదే సమయంలో తాను వ్యక్తిగతంగా వేలాది మంది తల్లితండ్రులు, తాతయ్యలతో మట్లాడినప్పుడు.. ఆన్ లైన్ లో పిల్లల భద్రత గురించి బాధపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 18న ప్రారంభమయ్యే చివరి రెండు వారాల సెషన్ లో ఈ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో... 16 ఏళ్ల లోపు ఆస్ట్రేలియన్ పిల్లలను ఎలా మినహాయించాలనే అంశంపై 12 నెలల పాటు పని చేయడానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్, టిక్ టాక్ మొదలైన ఫ్లాట్ ఫారమ్స్ లతో చట్టం ఆమోదించబడిన ఒక సంవత్సరం తర్వాత ఈ వయోపరిమితి అమలులోకి వస్తుందని ప్రధాని ఆల్బనీస్ అన్నారు.

ఇదే సమయంలో... ఈ యాక్సెస్ ను నిరోధించడానికి ఆ పిల్లలు రకరకాల ప్రయత్నాలు చేస్తారని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లదే అని తెలిపారు. తల్లితండ్రుల సమ్మతి ఉన్న పిల్లలకు, ఇప్పటికే అకౌంట్స్ ఉన్న పిల్లలకు మినహాయింపులు ఏమీ ఉండవని ఆల్బనీస్ స్పష్టం చేశారు.