Begin typing your search above and press return to search.

అన‌కాప‌ల్లి కుర్రాడి కృషితో పైర‌సీకి చ‌ర‌మ గీతం!

అయితే ఈ ర‌క‌మైన పైర‌సీకి ఇక చెక్ పడిన‌ట్లే. అన‌కాప‌ల్లికి చెందిన పి. వినోద్ కుమార్ పైర‌సీని నిర్మూలించేదుకు కొత్త ఆవిష్క‌ర‌ణ క‌నిపెట్టాడు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 6:30 AM GMT
అన‌కాప‌ల్లి కుర్రాడి కృషితో పైర‌సీకి చ‌ర‌మ గీతం!
X

ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా..ఎంత క‌ఠినంగా నిబంధ‌లున్నా? పైర‌సీ భూతాన్ని అరిక‌ట్ట‌డం మాత్రం సాధ్యం కాలేదు. థియేట‌ర్లో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు గంట‌లోనే థియేట‌ర్ ప్రింట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. వివిధ వెబ్ సైట్స్ లో సినిమా మొత్తం ఉంటుంది. ఇలాంటి వెబ్ సైట్స్ పై ఎన్ని క‌ఠినం ఆంక్ష‌లున్నా? దాన్ని ఆప‌డం మాత్రం సాధ్య‌ప‌డ‌లేదు. స్మార్ట్ ఫోన్ టెక్నాల‌జీ రావ‌డంతోనే థియేట‌ర్లో సినిమా ఈజీగా పైర‌సీ అవుతుంది.

అదెలా జ‌రిగింద‌ని సైబ‌ర్ క్రైమ్ ఎంత ఆరా తీసినా ప‌ట్టుకోవ‌డం సాధ్య‌మ‌వ్వ‌లేదు. థియేట‌ర్లో ఎక్క‌డ నుంచి పైర‌సీ అవుతుందో కూడా క‌నిపెట్ట‌డం యాజ‌మాన్యానికి పెద్ద భారంగానూ మారుతుంది. తొలి షో ప‌డిదంటే థియేట‌ర్ లో లోప‌ల ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించి ప‌హారా పెట్టాల్సిన ప‌రిస్థితులు. అయితే ఈ ర‌క‌మైన పైర‌సీకి ఇక చెక్ పడిన‌ట్లే. అన‌కాప‌ల్లికి చెందిన పి. వినోద్ కుమార్ పైర‌సీని నిర్మూలించేదుకు కొత్త ఆవిష్క‌ర‌ణ క‌నిపెట్టాడు.

పైర‌సీ సెక్యూర్టీ బోర్డును త‌యారు చేసాడు. దీనికి ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ ఇండియా బుధ‌వారం పేటెంట్ మంజూరు చేసింది. 2016లోనే పైర‌సీ సెక్యూర్టీ బోర్డును రూపొందించారు. దీన్ని తెర వెనుక అమ‌రిస్తే అందులో నుంచి వ‌చ్చే ఐఆర్ కిర‌ణాల కార‌ణంగా వీడియో వీడియో తీసినా రికార్డు అవ్వ‌దు. దీనిపై అదే ఏడాది ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ ఇండియాకు పేటెంట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసారు. జ‌పాన్, అమెరికా నుంచి ఇదే త‌ర‌హా సాంకేతిక‌తతో త‌యారైన ప్రోటో టైప్ లు ఉండ‌టంతో పేటెంట్ ల‌భించ‌లేదు.

ఏడుళ్ల త‌ర్వాత పేటెంట్ ల‌భించింది. గ‌తంలోనే అమెరికాలోని పాక్స్ స్టూడియోస్ పైర‌సీని నియంత్రించేదుకు వాట‌ర్ మార్క్ టెక్నాల‌జీ అందుబాటులోకి తెచ్చింది. దీని ఆధారంగా థియేట‌ర్ లో సినిమా ర‌న్నింగ్ లో ఉన్న‌ప్పుడు కొన్ని క్ష‌ణాల్లో ఓ నెంబ‌ర్ వ‌చ్చి వెళ్తుంది. దీని ఆధారంగా పైర‌సీ థియేట‌ర్లో ఎక్క‌డ జ‌రుగుతుందో గుర్తించవ‌చ్చు. కానీ నియంత్రించ‌డం సాధ్యం కాదు. ఇది తెలుసుకున్న వినోద్ కుమార్ మ‌రింత అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకొచ్చాడు.