Begin typing your search above and press return to search.

సోనియా గాంధీ నుంచి కాంగ్రెస్ శ్రేణులకు బ్యాడ్ న్యూస్?

ఇందులో భాగంగా... ఇకపై ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె యోచిస్తోన్నట్లు కథనాలొస్తున్నాయి. దీంతో... ఈ విషయం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:30 PM GMT
సోనియా గాంధీ నుంచి కాంగ్రెస్  శ్రేణులకు బ్యాడ్  న్యూస్?
X

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. మోడీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరిగితే మే నేలాఖరు నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అవును... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని "ఇండియా" కూటమి బలంగా భావిస్తున్న వేళ... అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధినేత్రి, లోక్‌ సభ సభ్యురాలు సోనియా గాంధీ.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఇకపై ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె యోచిస్తోన్నట్లు కథనాలొస్తున్నాయి. దీంతో... ఈ విషయం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం సోనియా గాంధీ... ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీ నుంచి లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 2004 నుంచీ క్రమం తప్పకుండా ఆమె భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలో 2004లో 2.49.., 2006 బై ఎలక్షన్ లో 4.17.., 2009లో 3.72.., 2014లో 3.52.., 2019లో 1.67 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె రికార్డ్ స్థాయిలో గెలుపొందుతూ ఉన్నారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తే గెలుపు లాంచనమేనని భావిస్తున్న నేపథ్యంలో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఇకపై ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ యోచిస్తోన్నట్లు సమాచారం! ఆమె ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం... ఆరోగ్యం సహకరించకపోవడమే అని అంటున్నారు.

దీంతో... తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈ స్థానం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే... సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ... ఈసారి లోక్ సభకు బదులుగా రాజ్యసభకు ఎన్నిక కావాలనే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో... తాజాగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కర్ణాటక, తెలంగాణలలో ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని అంటున్నారు.