మోడీ మళ్లీ ప్రధాని అయితే.. గుండు కొట్టించుకుంటా: బిగ్ సవాల్
ఇప్పటికే మోడీ విధానాలతో దేశం నాశనమైపోయిందని భావిస్తున్నవారు.. తాజా ఎగ్జిట్ పోల్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
By: Tupaki Desk | 2 Jun 2024 9:46 AM GMTతాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తర్వాత.. రాజకీయంగా వివాదాలు కూడా ముసురుకుంటున్నాయి. ముఖ్యం గా ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న వారు తెరమీదికి వస్తున్నారు. ఇప్పటికే మోడీ విధానాలతో దేశం నాశనమైపోయిందని భావిస్తున్నవారు.. తాజా ఎగ్జిట్ పోల్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మేనేజ్ చేయించుకున్నారని చెబుతున్నారు. అందుకే ఏకపక్షంగా జాతీయ మీడియా బీజేపీకి ఒత్తాసు పలికిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా స్పందించిన ఢిల్లీ అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయెన్స్ అభ్యర్థి సోమనాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఇప్పుడు ఇచ్చిన సర్వేలన్నీ శుద్ధ అబద్ధం. ఇవి నిజం కావు. బీజేపీ ఆఫీసు నుంచి వచ్చిన సర్వేలు.. మీడియా ముఖంగా బయటకు వచ్చా యి. మోడీ గెలిచేందుకు అవకాశం లేదు`` అన్నారు. అంతేకాదు... ఒకవేళ మోడీ కనుక.. మూడో సారి ప్రధాని అయితే.. తాను బహిరంగంగా గుండు కొట్టించుకుంటానని సవాల్ రువ్వారు.
''మూడో మూడోసారి ప్రధాని అయితే నేను గుండు గీయించుకుంటా. నేను చెబుతున్నది అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. ఈ ఎగ్జిట్ పోల్స్ తప్పు. ఇవన్నీ.. బీజేపీ ఆఫీసుల నుంచి వచ్చాయి. ఇవి ఖచ్చితంగా తప్పవుతాయి. ఈ విషయం ప్రజలే జూన్ 4న నిరూపిస్తారు. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలు ఇండియా దక్కించుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్‌కు మోడీ భయం ఉంది. అందుకే ఆయన ఓడిపోతారని చెప్పలేదు'' అని భారతి వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ కూడా.. మోడీకి జై కొట్టాయి. బీజేపీ 350 స్థానాలకు పైగానే దక్కించుకుంటాయని చెప్పాయి. అంతేకాదు.. ఢిల్లీలోని ఏడు స్థానాలు కూడా.. బీజేపీ దక్కించుకుంటుం దని చెప్పడం గమనార్హం. వాస్తవానికి 2019లో ఒక్క సీటు కూడా.. బీజేపీ దక్కించుకోలేదు. అప్పటి లెక్కలతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింతగా బీజేపీపై ఢిల్లీ వాసులకు ఆగ్రహం ఉంది. సీఎం కేజ్రీవాల్ ను జైలుకు పంపించడం.. లెఫ్టినెంట్ గవర్నర్ దూకుడుగా ఉండడాన్నిఇక్కడిప్రజలు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ అనన్ని చోట్లా విజయం సాధిస్తుందనని చెప్పడంతో ఎగ్జిట్ పోల్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.