బీజేపీ క్యాంప్ లో సోము విష్ణు వెయిటింగ్ ?
ఇకపోతే సోము వీర్రాజు 2015లో ఎమ్మెల్సీగా బీజేపీ కోటాలో నెగ్గారు. ఆరేళ్ల పాటు పనిచేశారు. ఇక టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన మిత్రులుగా ఉన్నాయి.
By: Tupaki Desk | 19 July 2024 3:27 AM GMTబీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతల జాబితా ఉంది. వారికి పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేకపోయింది. సోము వీర్రాజు రాజమండ్రి అర్బన్ టికెట్ కోరారు. అలాగే పార్టీలో సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం ఎంపీ సీటు ఆశించారు. అది కాకపోతే కదిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు.
కానీ ఆయనకూ దక్కలేదు. దాంతో పార్టీ విధేయులుగా ఉంటున్న ఈ ఇద్దరూ తమకు తగిన ప్రాధాన్యత అధినాయకత్వం కల్పిస్తుందని ఆశతో ఉన్నారు అని అంటున్నారు. శాసనమండలిలో 2025 తరువాత వరసబెట్టి ఖాళీలు ఉండబోతున్నాయి. అలాగే లోకల్ బాడీస్ ద్వారా గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల ద్వారా మండలిలో అడుగు పెట్టవచ్చు.
వీటిలో ఏదో ఒక పద్ధతి ద్వారా బీజేపీ కోటాలో ఈ ఇద్దరూ శాసన మండలి లోకి వెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు. సోము వీర్రాజు గురించి చూస్తే ఆరెస్సెస్ తో మంచి అనుబంధం ఉంది. ఆయన ఆరెస్సెస్ కార్యకర్తగా తన కెరీర్ స్టార్ట్ చేశారు.
విష్ణు వర్ధన్ రెడ్డి కూడా బీజేపీలో జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్న నేత అంటున్నారు. ఈ ఇద్దరి సామాజిక నేపధ్యంతో పాటు ప్రాంతాలు కూడా ఎమ్మెల్సీ పదవులు అందుకోవడానికి ప్లస్ గా మారుతాయని అంటున్నారు. సోము వీర్రాజు గోదావరి జిల్లాలకు చెందిన బలమైన సామాజిక వర్గం నేతగా ఉన్నారు. అదే విధంగా విష్ణువర్ధన్ రెడ్డిది రాయలసీమ నేపధ్యం. దాంతో వీరికి ఈ రకమైన సమీకరణలు అనుకూలిస్తాయని అంటున్నారు
బీజేపీ పెద్దల ఆలోచనలు చూస్తే పార్టీ విధేయులకే మంత్రి పదవులు కట్టబెట్టిన నేపధ్యం ఉంది. నర్సాపురం నుంచి గెలిచిన శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రిగా చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ్ ని రాష్ట్ర మంత్రిగా చేశారు. అంటే చాన్స్ వస్తే విధేయతకు పార్టీలో మొదటి నుంచి నమ్ముకున్న వారికే హై కమాండ్ పట్టం కడుతుందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే సోముకు విష్ణుకు కూడా ఎమ్మెల్సీగా అవకాశాలు దక్కుతాయని అనుచరులు అంటున్నారు.
ఇకపోతే సోము వీర్రాజు 2015లో ఎమ్మెల్సీగా బీజేపీ కోటాలో నెగ్గారు. ఆరేళ్ల పాటు పనిచేశారు. ఇక టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన మిత్రులుగా ఉన్నాయి. దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయని అంటున్నారు. దాంతో బీజేపీ సీనియర్లు అంతా వెయిటింగ్ అని అంటున్నారు.