Begin typing your search above and press return to search.

బాబు గ్రేట్ అంటున్న బీజేపీ సోము

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అందులో బీజేపీ కూడా ఉంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 12:30 AM GMT
బాబు గ్రేట్ అంటున్న బీజేపీ సోము
X

బీజేపీలో వర్గాలు ఉన్నాయని ప్రో టీడీపీ యాంటీ టీడీపీ అలాగే ప్రో వైసీపీ ఉన్నాయని చెప్పుకునే వారు. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు కదా. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అందులో బీజేపీ కూడా ఉంది. ఏపీలో టీడీపీతో పొత్తు కావాలనుకున్న వారందరికీ టికెట్లు వచ్చాయి. పదవులూ దక్కాయి.

అలా చూసుకుంటే రేసులో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు వెనకబడిపోయారు. ఆయన 2020లో ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ అయిన తరువాత టీడీపీ మీదనే తన విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. ఫలితంగా ఆయన రాజకీయం కూడా ఒడుదుడుకులు ఎదుర్కొంది అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ వారికి నామినేటెడ్ పదవులు కావాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే ఇవ్వగలరు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం కూడా పెద్దగా ఒత్తిడి పెట్టదు అని అంటున్నారు. ఎందువల్ల అంటే కేంద్రంలో బీజేపీకి ఆక్సిజన్ లాంటి మద్దతుని టీడీపీ ఇస్తోంది. బాబు జాతీయ స్థాయిలో అత్యంత పలుకుబడి కలిగిన నేత. ఆయన ఎన్డీయేలో ఉంటేనే ఆ కూటమికి ఎంతో బలం. బాబు కనుక ఒకసారి రెడ్ సిగ్నల్ చూపిస్తే జాతీయ స్థాయిలో రాజకీయాలు మారిపోతాయి.

దాంతో బాబుకు కేంద్రం కూడా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీలోని బీజేపీ నేతలు కూడా బాబుని ప్రసన్నం చేసుకునేందుకే చూస్తున్నారు. ఇపుడు ఆ లిస్ట్ లో సోము వీర్రాజు కూడా ఉన్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన పెద్దగా బాబు గురించి మెచ్చుకోలు కబుర్లు అయితే మాట్లాడరు అని పేరుంది. కానీ విశాఖలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు అయితే బాబుని బాగా ప్రశంసించారు.

అచ్యుతాపురం సెజ్ లో దారుణ ఘటన జరిగిన వెంటనే బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు గ్రేట్ అనేశారు. ఇటీవల కాలంలో విశాఖలో ఊహించని పరిణామాలను చూస్తున్నామని ఆయన అన్న్నారు. అయితే పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని అన్నారు.

విశాఖ ఫార్మా ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారని ఫార్మా కంపెనీలో ప్రమాదాలను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారని సోము చెప్పడం విశేషం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయని తెలిపారు.

గత ఐదేళ్ల పాటు అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లను గ్రామపంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

ఇలా వైసీపీని పెద్ద ఎత్తున విమర్శిస్తూ చంద్రబాబు పాలన భేష్ అని సోము మెచ్చుకోవడం కీలకమైన పరిణామం గానే అంతా చూస్తున్నారు. బీజేపీ తరఫున సోము ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు అని అంటున్నారు. 2014 నుంచి 2018 దాకా బీజేపీ టీడీపీ పొత్తు ఉన్న టైంలోనే సోము ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు.

ఇపుడు కూడా ఆయనకు పదవి దక్కాలీ అంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. దాంతో బాబుని ప్రసన్నం చేసుకోవడమే శరణ్యం అని సోము భావించారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి మారిన సోము వైఖరి ఏపీ రాజకీయాల్లో ఆయనకు ఏ విధంగా కీలకం చేస్తుందో.