సోము వారి మాస్టర్ ప్లాన్.. సక్సెస్ అయ్యేనా?
బీజేపీ ఏపీ మాజీ చీఫ్.. సోము వీర్రాజు మాస్టర్ ప్లాన్ వేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 8 Jun 2024 4:30 PM GMTబీజేపీ ఏపీ మాజీ చీఫ్.. సోము వీర్రాజు మాస్టర్ ప్లాన్ వేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో సోము ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఇక తాజా ఎన్నిక ల్లో ఆయన రాజమండ్రి రూరల్ టికెట్‌ను తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అదిసాధ్యం కాలేదు. చివరకు రాజమండ్రి నుంచి ఎంపీగా అయినా పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షరాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కోరికా నెరవేరలేదు. అసలు ఆయన పేరును పరిశీలించినట్టు కూడా వార్తలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మంత్రి పదవిపై కన్నేసినట్టు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో త్యాగం చేసి.. పార్టీ కోసం పనిచేసినట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోతనకు హైకమాండ్‌లో ఉన్న పరిచయాలు.. ఇతర వర్గాల సహకారంతో ఇప్పుడు మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే.. ఇది నూటికి నూరు శాతం విఫలం అవుతుందని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు సోము ఎమ్మెల్సీ కాదు. ఇది అయ్యేందుకు మరో రెండేళ్లయినా పడుతుంది. సో.. దీంతో ఆయన మరో యాంగిల్‌లోనూ ప్రయత్నాలు చేసుకుం టున్నట్టు సమాచారం.
దీనిలో భాగంగా తనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇప్పించాలంటూ.. ఆర్ ఎస్ ఎస్ యంత్రాంగం ద్వా రా ప్రయత్నిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే తనకు చివరి కోరిక అని.. తనకు ఈ అవకాశం ఇప్పించాలని కూడా.. సోము కోరుతున్నట్టు తెలిసింది. అయితే.. దీనికి కూడా.. సొంత పార్టీలోనే పోటీ ఉండడం.. కూటమి పార్టీలు కూడా.. పోటాపోటీగా.. దీనికి పోటీ ఇవ్వడంతో.. ఈ సీటు కోసం.. `చివరి` అవకాశం అంటూ.. సోము ఆర్ ఎస్ ఎస్‌లో బలమైన వర్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఆయనకు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.