ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు అమ్మనే చంపేశాడు... విశాఖలో దారుణం!
ఇటీవల కాలంలో ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ కు యువత విపరీతంగా అడిక్ట్ అవుతున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Jan 2025 2:30 PM GMTఇటీవల కాలంలో ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ కు యువత విపరీతంగా అడిక్ట్ అవుతున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆన్ లైన్ గేమ్స్ కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి కొంతమంది ఉండగా.. ఆ ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ చాలానే తెరపైకి వచ్చాయి.
ఆ స్థాయిలో ఆన్ లైన్ గేమ్స్ కి జనాలు ప్రభావితమైపోతున్నారు. చూసు చూసి లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారనేది చాలా పెద్ద ప్రశ్న! వాటికి ఏ స్థాయిలో అడిక్ట్ అయితే ఆత్మహత్య స్థాయి ఆలోచనలు చేస్తారు అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలో... ఆన్ లైన్ గేమ్స్ ఆడోద్దన్నందుకు కన్న తల్లినే కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు.
అవును... ఇటీవల కాలంలో మత్తు పదార్థాలకు అలవాటైనట్లుగా ఆన్ లైన్ గేమ్స్ కి కూడా యువత విపరీతంగా బానిసలైపోతున్నరనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. దీనికి సంబంధించి అనేక ఘటనలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో తాజాగా ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు కన్న తల్లినే హత్యమార్చాడు విశాఖలో ఓ యువకుడు.
వివరాళ్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని మల్కాపూరంలో కోస్ట్ గార్డ్ కమాండర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. ఈ సమయంలో.. బీటెక్ చదువుతున్న వారి కుమారుడు ఆన్ లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. దీంతో... తల్లి ఆల్కాసింగ్ తరచూ మందలించేది. ఈ క్రమంలో తాజాగా కుమారుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్న ల్యాప్ టాప్ తీసుకుని దాచిపెట్టింది.
ఈ క్రమంలో ల్యాప్ టాప్ ఇవ్వాల్సిందిగా తన తల్లితో గొడవ పెట్టుకున్నాడు సదరు యువకుడు. ఆమె ల్యాప్ టాప్ ఇవ్వడానికి ససేమిరా అంగీకరించకపోవడంతో కోపంతో చాకు తీసుకుని తల్లిని పొడిచి హత్యచేశాడు. అనంతరం.. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కల్యాణి ఆస్పత్రికి తరలించాడు. అయితే.. ఆమె ఒంటిగా గాయాలు ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు!