Begin typing your search above and press return to search.

రెడ్‌ లైట్‌ ఏరియాకు రావచ్చుగా.. అలా చేయడమెందుకు?

కోల్‌ కతాలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Aug 2024 4:30 PM GMT
రెడ్‌ లైట్‌ ఏరియాకు రావచ్చుగా.. అలా చేయడమెందుకు?
X

కోల్‌ కతాలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని.. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని, పోలీసులపై మండిపడింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్యులు తమకు భద్రత కల్పించాలని.. కోల్‌ కతా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెడ్‌ లైట్‌ ఏరియాకు చెందిన ఒక మహిళ చేసిన విన్నపం అందరినీ కదిలిస్తోంది. కోల్‌ కతాలోని సోనాగచ్చి రెడ్‌ లైట్‌ ఏరియాకు చెందిన ఒక మహిళ.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్త్రీల జీవితాలను నాశనం చేయడానికి బదులు, వారిపై అత్యాచారాలకు తెగించే బదులు తమ వద్దకు రావచ్చుగా అని కోరింది.

రెడ్‌ లైట్‌ ఏరియాలో రూ.20, రూ.50కే పురుషులకు తాము సేవలు అందిస్తున్నామని ఆ మహిళ తెలిపింది. మహిళలపై కోరిక కలిగినప్పుడు.. వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు చేయకుండా రెడ్‌ లైట్‌ ఏరియాకు వచ్చి తమ సేవలు పొందవచ్చు కదా ఆ మహిళ వెల్లడించింది.

కోల్‌ కతాలో జరిగిన యువ వైద్యురాలి హత్యాచార ఘటన తమను చాలా బాధపెట్టిందని ఆ రైడ్‌ లైట్‌ ఏరియా మహిళ వాపోయింది. ఆడవాళ్ల మీద అంత మోజు ఉంటే దయచేసి అత్యాచారాలు చేయొద్దని.. తమ వద్దకు రావాలని విన్నవించింది.

దీంతో ఆ రెడ్‌ లైట్‌ ఏరియా మహిళపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాలతో విధివంచితులైన స్త్రీలు రెడ్‌ లైట్‌ ఏరియాలో తమ బతుకులు వెళ్లదీస్తుంటారు. అయినప్పటికీ ఆమె తన తోటి మహిళల మేలు కోసం ఆలోచించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

కాగా ఒక నెటిజన్‌ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రెడ్‌ లైట్‌ ఏరియాకు వెళ్లినా అక్కడ కూడా ఇంకో మహిళ ఉంటుందని.. తన కామాన్ని, పశుత్వాన్ని ఆమెపై తీర్చుకోవడం సరికాదని పేర్కొన్నాడు.

ఏదేమైనా కోల్‌ కతా హత్యాచారం చివరకు రెడ్‌ లైట్‌ ఏరియాలో ఉన్నవారిని సైతం కదిలిస్తోంది. వారు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ల మీద మోజు ఉంటే వారి జీవితాలను నాశనం చేయకండి.. రెడ్‌ లైట్‌ ఏరియాలను సందర్శించండి అంటూ కోల్‌ కతా రెడ్‌ లైట్‌ ఏరియా మహిళ పిలుపు ఇవ్వడం ఆమె ఆవేదనకు అద్దం పట్టింది.