Begin typing your search above and press return to search.

"పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో వేయండి"... బుడ్డోడి వీడియో వైరల్!

ఐదేళ్ల బుడ్డోడు ఏమి చేస్తాడు? బలవంతంగా స్కూల్ కి వెళ్తాడు.. ఇంటికొచ్చాక ఆడుకుంటాడు.. హాలీడేరోజు ఐతే పండుగ చేసుకుంటాడు

By:  Tupaki Desk   |   21 Aug 2024 7:27 AM GMT
పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో వేయండి... బుడ్డోడి వీడియో వైరల్!
X

ఐదేళ్ల బుడ్డోడు ఏమి చేస్తాడు? బలవంతంగా స్కూల్ కి వెళ్తాడు.. ఇంటికొచ్చాక ఆడుకుంటాడు.. హాలీడేరోజు ఐతే పండుగ చేసుకుంటాడు.. చాక్లెట్లు, బిస్కెట్ల కోసం మారాం చేస్తాడు..! అలా అనుకుంటే పొరపాటే! ఇప్పుడు చెప్పుకోబోయే బుడ్డోడు మామూలోడు కాదు.. తన తండ్రిపై ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు హామీ ఇస్తే తప్ప బయటకు రాలేదు!

ఆవును... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బుడ్డోడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి తన నాన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోలో ఆ బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు గల కారణం విని పోలీసులు షాకయ్యారు. ఇంతకూ ఆ బాలుడు తన తండ్రిపై చేసిన ఫిర్యాదు ఏమిటంటే... తనను రోజు కొడుతున్నాడంట.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఈ సమయంలో పోలీస్ అధికారి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఏడ్వడం మొదలుపెట్టాడు! దీంతో.. ఏమి జరిగిందని పోలీసులు ఆరా తీయగా ఇక మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా... తన తండ్రి ఇక్బాల్ పై ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు చెప్పాడు.

దీంతో.. కాస్త తేరుకున్న పోలీసులు అధికారి.. మీ నాన్నపై ఎందుకు కేసు పెడుతున్నావు అని అడిగితే... తన తండ్రి రోజూ తనను కొడుతున్నాడని ఏడుస్తూ చెప్పాడు. ఇదే సమయంలో.. ఇంటిదగ్గర్లో ఉన్న నదివైపు, రోడ్డువైపూ వెళ్లొద్దంటూ ఆపుతున్నాడని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. తన ఫిర్యాదు తీసుకుని నాన్నను జైల్లో పెట్టాలని కోరాడు.

దీంతో... విషయం అర్ధం చేసుకున్న పోలీస్ అధికారి స్పందిస్తూ.. మీ నాన్న ఇక్బాల్ పై రిపోర్ట్ రాసుకున్నానని.. అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో ఆ బుడ్డోడు పోలీస్ స్టేషన్ నుంచి వెనుదిరిగాడు. ఈ సమయంలో... ఆ బుడ్డోడికి – పోలీస్ అధికారికీ మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.