తెలంగాణ ఉద్దేశాన్ని నెరవేరుస్తాం: సోనియా గాంధీ వీడియో సందేశం
తమ కర్తవ్యంగా భావించి.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
By: Tupaki Desk | 2 Jun 2024 9:49 AM GMTతెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మాజీఅధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. 2014లో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని తెలంగాణ ప్రజల అభిమతాన్ని, వారి కోరికను, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురైనా. తమ కర్తవ్యంగా భావించి.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
గత పదేళ్లలో రాష్ట్ర స్థాపన ఉద్దేశం నెరవేరలేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పడిన తెలంగాణలో అసలైన ప్రగతి ఇప్పుడే ప్రారంభమైందని సోనియాగాంధీ వివరించారు. తద్వారా.. తెలంగాణ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికోసం.. అన్ని వర్గాల ను సమానంగా అభివృద్ది చేసేందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తామన్నారు.
తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని... వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని సోని యా గాంధీ తెలిపారు. త్యాగమూర్తుల సంకల్పాన్ని సఫలం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.. వికసిత తెలంగాణ కోసం.. అన్ని చర్యలూ తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రతిఒక్కరి కలనూ నిజం చేసేందు కు ప్రయత్నించనున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు వీడియో సందేశం విడుదల చేశారు.