Begin typing your search above and press return to search.

అడల్ట్ ఫిల్మ్‌ స్టార్ సోఫియో లియోన్ మృతి!

అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియో లియోన్ మరణించింది. 18ఏళ్ల వయసుకే అడల్ట్ ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టిన లియోన్... 26ఏళ్ల వయసులోనే మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

By:  Tupaki Desk   |   10 March 2024 4:00 PM IST
అడల్ట్  ఫిల్మ్‌  స్టార్  సోఫియో లియోన్  మృతి!
X

అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియో లియోన్ మరణించింది. 18ఏళ్ల వయసుకే అడల్ట్ ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టిన లియోన్... 26ఏళ్ల వయసులోనే మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణించిన విషయాన్ని ఆమె సవతి తండ్రి మైక్ రోమెరో తెలిపారు. యూఎస్ లోని ఆమె అపార్ట్ మెంట్ లో అచేతన స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో... ఆమె మరణంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది.

అవును... అడల్ట్ పరిశ్రమలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో ఒకరిగా చెబుతున్న సోఫియో లియోన్ మృతిచెందింది. ఈ సందర్భంగా... ప్రియమైన సోఫియా మరణించిన వార్తను ఆమె తల్లి, కుటుంబం తరుపున తాను భారమైన హృదయంతో పంచుకుంటున్నట్లు ఆమె సవతి తండ్రి రోమెరో వెల్లడించారు. ఆమె ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.

ఈ క్రమంలో ఆమె మరణానికి గల కారణాలను స్థానిక పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తుంది. ఆమె మోడలింగ్ ఏజెన్సీ ఈ వార్తని ధృవీకరించింది! ఇందులో భాగంగా... తమకు ఎంతో ప్రియమైన సోఫియా లియోన్ అకాల మరణం తమ హృదయాలను విరిచేసిందని తెలిపింది. అనంతరం "రిప్ స్వీట్ ఏంజెల్" అని ట్వీట్ చేస్తూ.. ఆమె కుటుంబం కొసం "గోఫండ్ మీ" ప్రారంభించబడిందని తెలిపింది.

కాగా... 10 జూన్ 1997లో అమెరికాలోని మియామీలో జన్మించిన సోఫియా.. తన 18వ ఏట అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇలా అడల్ట్ పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు మరణిస్తుండటం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఈమె కంటే ముందు కాగ్నీ లిన్ కార్టర్, జెసీ జేన్, థైనా ఫీల్డ్స్ లు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే!