బాబు-పవన్‌లే.. బీజేపీకి బాసట.. విషయం ఏంటంటే!
పైగా.. పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నొక్కి చెబుతున్న సనాతన ధర్మం అనే మాట.. బీజేపీకి ఇప్పుడు కలిసి వచ్చే పరిణామం.
By: Tupaki Desk | 23 March 2025 2:33 PM ISTదక్షిణాది-ఉత్తరాదిగా మారుతున్న జాతీయ రాజకీయాలు.. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బం దిగానే పరిణమించాయి. ఒకప్పుడు సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు మోడీని, కేంద్రంలోని బీజేపీ హవాను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహిం చిన అఖిల పక్ష సమావేశం విజయవంతం అయిన దరిమిలా.. దక్షిణాదిలో బీజేపీయేతర పార్టీలు.. ఏకతాటిపైకి వచ్చిన సంకేతాలు విస్పష్టంగా తెలుస్తున్నాయి.
ఒకప్పుడు బీజేపీకి దన్నుగా ఉన్న ఒడిసా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా.. ఇప్పుడు స్టాలిన్ నిర్వ హించిన సమావేశానికి రావడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం నిర్వహించిన సమావేశం డీలిమిటేషన్‌కు మాత్రమే పరిమితం అయినా.. మున్ముందు రాజకీయ వ్యూహాలకు కూడా ఈ పార్టీలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఇది దేశవ్యాప్తంగా కాకున్నా.. దక్షిణాదిలో కమల వికాసానికి పెను అడ్డంకిగా మారే అవకా శం ఉంది. ఇది బీజేపీకి తీవ్ర ఇబ్బందికర పరిణామం.
అందుకే.. దక్షిణాది రాజకీయాల విషయంపై బీజేపీ నాయకులు కలవరపడే పరిస్థితి వచ్చిందని అంటు న్నారు పరిశీలకులు. ఇదిలావుంటే.. దక్షిణాదిలో బీజేపీయేతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ కోవలేక వచ్చే టీడీపీ, జనసేనలు మాత్రం కమల నాథులతోనే కలిసి ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని వారు స్పష్టం చేశారు కూడా. పైగా.. పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నొక్కి చెబుతున్న సనాతన ధర్మం అనే మాట.. బీజేపీకి ఇప్పుడు కలిసి వచ్చే పరిణామం.
అంటే.. ఇతర పార్టీలకు భిన్నంగా.. ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి ఉండడం.. భవిష్యత్తులోనూ.. కలిసి ముందుకు సాగుతామని చెప్పడం ద్వారా ఇతర పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుం దన్నది విశ్లేషకుల మాట. ఏపీలో చంద్రబాబు చూసుకున్నా.. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బాణి, వాణిని పరోక్షం గా వినిపించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉన్నట్టు సంకేతాలు అందాయి. ఒకరకంగా ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి కేంద్రంలోనేకాదు.. దక్షిణాదిలోనూ చంద్రబాబు, పవన్‌లు దన్నుగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.