Begin typing your search above and press return to search.

1.7లక్షల డాలర్లు ఉంటే చనిపోయిన వారిని బ్రతికిస్తారంట!

ఒక్కసారి మరణించినవారు తిరిగి బ్రతకడం సాధ్యమేనా?.. ఒకసారి ఆయుష్షు తీరిన వారు తిరిగి పునర్జీవం పొందడం జరిగేపనేనా

By:  Tupaki Desk   |   29 May 2024 5:19 AM GMT
1.7లక్షల డాలర్లు ఉంటే చనిపోయిన వారిని బ్రతికిస్తారంట!
X

ఒక్కసారి మరణించినవారు తిరిగి బ్రతకడం సాధ్యమేనా?.. ఒకసారి ఆయుష్షు తీరిన వారు తిరిగి పునర్జీవం పొందడం జరిగేపనేనా?.. ఒకవేళ అదే నిజమైతే ఈ సృష్టి పరిస్థితి ఏమిటి?.. ఈ భూమిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?.. అనే ప్రశ్నల్లో మొదటి వాటికి సమాధానం చెబుతాము అంటుంది ఆస్ట్రేలియాలోని ఓ సంస్థ. కాస్త డబ్బులు చెల్ల్లిస్తే చాలు మరణించినవారిని తిరిగి బ్రతికిస్తామని చెబుతుంది.

అవును... ఆస్ట్రేలియాలోని ప్రముఖ సదరన్ క్రయోనిక్స్ సంస్థ మరణించినవారిని భవిష్యత్తులో తిరిగి బ్రతికిస్తామంటోంది. ఈ ఏడాది మే 12న ఓ వృద్ధుడు (80) చనిపోగా... ఆ మృతదేహాన్ని మైనస్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద భద్రపరిచిందంట. ఇలా ఫ్రీజ్ చేసిన భద్రపరిచిన మృతదేహాలను భవిష్యత్తులో మేలు కొలిపే అవకాశం ఉంటుందని చెబుతోంది. అతను కంపెనీ "పేషెంట్ వన్"గా పేర్కొన్నారు.

దీనికోసం ఒక్కో కస్ట్ మర్ నుంచి సుమారు 1,70,000 డాలర్లను వసూలు చేస్తుండగా.. వైద్య ఖర్చులు అదనం అని పేర్కొందని తెలుస్తుంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన సదరన్ క్రయోనిక్స్ ఫెసిలిటీ మేనేజర్ ఫిలిప్ రోడ్స్... ఈ సంవత్సరం నుండి మృతదేహాలను చేర్చుకోవడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని.. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు!

ఏబీసీ న్యూస్ కథనాల ప్రకారం... "పేషెంట్ వన్" మే 12న సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు. అతని శరీరాన్ని తిరిగి బ్రతికించాలనే ఆశతో 10 గంటల ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది. ఇందులో భాగంగా మృతదేహాన్ని ఆసుపత్రిలోని శీతల గదిలోకి తరలించి, ఐస్‌ లో ప్యాక్ చేశారు. వైద్యులు అప్పుడు ఒక రకమైన యాంటీ ఫ్రీజ్‌ గా పనిచేసే ద్రవాన్ని పంప్ చేశారు.

ఈ సమయంలో... మృతదేహాన్ని స్పెషల్ స్లీపింగ్ బ్యాగ్‌ లో చుట్టి డ్రై ఐస్‌ లో ప్యాక్ చేశారు. అతని శరీర ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 80 డిగ్రీల సెల్సియస్‌ కు తగ్గించబడింది. మరుసటి రోజు సదరన్ క్రయోనిక్స్ యొక్క హోల్‌ బ్రూక్ సదుపాయానికి ఆ మృతదేహం బదిలీ చేయబడింది. ద్రవ నైట్రోజన్ డెలివరీ అయ్యే వరకు అతను పొడి మంచు మీదనే ఉన్నాడు. ఆ తర్వాత ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెల్సియస్‌ కు తగ్గించబడింది.

అయితే... ఈ వ్యవహారంపై కొంతమంది హోప్స్ పెట్టుకుని ముందుకు కదులుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో మరికొంతమంది మాత్రం ఇది ప్రకృతికి, సృష్టికి పూర్తి విరుద్ధమని.. బ్రతికున్నప్పుడు ఆయుష్షు పెంచడాన్ని నమ్మొచ్చు కానీ, మృతిచెందినవారిని తిరిగి బ్రతికించడం అనేప్రక్రియ ఆల్ మోస్ట్ చీటింగ్ అని అంటున్నారట.