ఫోటోలు... కిమ్ కి మాత్రమే ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు?
దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారగా.. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ కి మాత్రమే ఎలా చేస్తాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
By: Tupaki Desk | 29 May 2024 3:24 PM GMTవినూత్నంగా ఆలోచిస్తాడో.. లేక, తనకు మాత్రమే ఈ తరహా ఆలోచనలు వస్తాయో తెలియదు కానీ.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. రొటీన్ కి భిన్నంగా ఆలోచించి దక్షిణ కొరియాపై రివేంజ్ తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారగా.. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ కి మాత్రమే ఎలా చేస్తాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అవును... దాయాది దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా వినూత్నంగా రివేంజ్ తీర్చుకుంది. ఇటీవల దక్షిణ కొరియాలోని కొందరు నిరసనకారులు బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలుపెట్టారు. దీంతో కిమ్ ప్రభుత్వం డిఫరెంట్ గా ఆలోచించింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియాపై చెత్త యుద్ధం ప్రకటించింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
దక్షిణ కొరియా నిరసనకారులు బెలూన్లలో లేఖలు పంపడాన్ని ఉన్మాద పిచ్చితనం, విస్మరించలేని చాలా ప్రమాదకరమైన రెచ్చగొట్టడం అని కిమ్ అభిప్రాయపడినట్లు ఉత్తర కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ సమయంలో కిమ్ ఈ విషయంపై డిఫరెంట్ గా ఆలోచించారు. దీంతో.. ఉత్తర కొరియా నుంచి చెత్తను సంచుల్లో నింపి బెలూన్ల ద్వారా దక్షిణకొరియాకు పంపుతున్నారు.
ఇలా పంపిన బెలూన్ లలో ప్లాస్టిక్ సీసాలు, బ్యాటరీలు, షూ భాగాలు, పేడ, మొదలైనటువంటి చెత్త ఉన్నట్లు దక్షిణ కొరియా సైనిక అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 260 ఉత్తర కొరియా బెలూన్లు పడిపోయాయని అధికారులు వెల్లడించారు.
అయితే... ఉత్తర కొరియా నుంచి వచ్చి పడిన ఏ బెలూన్ నూ ప్రజలు తాకవద్దని.. అవి పడిన, కనిపించిన వెంటనే మిలిటరీ ర్యాపిడ్ రెస్పాన్స్, పేలుడు క్లియరెన్స్ బృందాలకు సమాచారం అందించాలని దక్షిణాది మిలిటరీ తెలిపింది. ఉత్తర కొరియా తన అమానవీయ, అసభ్య చర్యను వెంటనే ఆపాలని గట్టిగా హెచ్చరించింది.
ఇదే సమయంలో... ఉత్తర కొరియా చేస్తున్న ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని దక్షిణ కొరియా బలంగా చెబుతుంది.
కాగా... కొన్నేళ్లుగా దక్షిణ కొరియాలోని ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు, సంప్రదాయవాద కార్యకర్తలు బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోని పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలను బెలూనల్కు కట్టి ఎగురవేస్తున్నారు. దీంతో... ఇది కిమ్ జోంగ్ ఉన్ కు ముప్పు తెచ్చిపెడుతుందనే ఆందోళన ఉత్తర కొరియా నుంచి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ద.కొరియా కరపత్రాలకు.. చెత్తతో సమాధానం చెబుతున్నాడు కిమ్!