Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే గారి భార్య బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న అధికారులకు షాక్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులతో ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2024 7:34 AM GMT
ఎమ్మెల్యే గారి భార్య బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న అధికారులకు షాక్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులతో ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి (వెంకాయమ్మ) పుట్టిన రోజు వేడుకల్లో ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు పాల్గొన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఎమ్మెల్యే భార్య కేక్‌ కోస్తుండగా ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు చప్పుట్లు కొడుతూ ఆమెకు హ్యాపీ బర్త్‌ డే చెబుతున్న ఘటన వివాదాస్పదమైంది.

ఏ పదవిలో ఎమ్మెల్యే భార్య బర్త్‌ డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం, ఆమెకు అభినందనలు తెలియజేయడం, ఆమె ముందు విధేయత చాటుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై పత్రికల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు, ఫొటోలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఎమ్మెల్యే భార్య వెంకట కుమారి (వెంకాయమ్మ) బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులు షాకాజు నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారం పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యే భార్య బర్త్‌ డే వేడుకల వ్యవహారం మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ కావడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు షోకాజు నోటీసులు ఇచ్చారు.

ఈ మేరకు ఎమ్మెల్యే భార్య బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలను ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి మందలించారని సమాచారం. అక్కడే వారికి చార్జి మెమోలు జారీ చేశారు. ఎలాంటి అధికారిక హోదా లేని ఆమె కార్యక్రమంలో మీరెందుకు పాల్గొన్నారంటూ ఎస్పీ వారికి క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. టీడీపీ పాలనలో పోలీసులను తమ ఇంటి పనులు చేసే బంట్రోతులుగా చూస్తున్నారని మండిపడుతోంది. దీనికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, హోం శాఖ మంత్రి అనిత ఏం చెబుతారని నిలదీసింది. మహిళలపై దాడులు చేసేవారిని, అత్యాచారాలు చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారా లేక టీడీపీ నేతల బర్త్‌ డే వేడుకల్లో పాలుపంచుకోవడానికి ఉన్నారా అని ఘాటు విమర్శలు చేస్తోంది.