Begin typing your search above and press return to search.

అంతరిక్ష యాత్ర ఫ్రమ్ చైనా... టిక్కెట్ ధర ఎంతో తెలుసా?

ఇటీవల కాలంలో స్పేస్ టూరిజం అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Oct 2024 9:36 AM GMT
అంతరిక్ష యాత్ర ఫ్రమ్ చైనా... టిక్కెట్  ధర ఎంతో తెలుసా?
X

ఇటీవల కాలంలో స్పేస్ టూరిజం అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భూమి నుంచి అంతరిక్షానికి తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకొస్తూ.. ఆ అనుభూతిని అందించే యాత్ర. ఈ క్రమంలో.. అమెరికాలో ఇప్పటికే పలు స్పేస్ కంపెనీలు ఈ అంతరిక్ష పర్యాటకాన్ని సక్సెస్ ఫుల్ గా చేపడుతున్నాయి. ఇప్పుడు చైనా స్టార్టప్ ఎంట్రీ ఇచ్చింది!

అవును... అంతరిక్షయాత్ర అనే అద్భుతమైన అనుభూతిని పొందాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే అందరూ ఆస్థాయి ఖర్చుకు సమర్థులు కాకపోవచ్చు! ఆ సంగతి అలా ఉంచితే... ఇప్పటికే యూఎస్ కు చెందిన పలు కంపెనీలు స్పేస్ టూరిజంను సక్సెస్ ఫుల్ గా చేపడుతున్న వేళ.. చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సైతం ఈ టూరిజంను ప్రారంభించింది.

వివరాళ్లోకి వెళ్తే... చైనాకూ చెందిన స్టార్టర్ "డీప్ బ్లూ ఏరోస్పేస్" ఇప్పుడు స్పేస్ టూరిజం స్టార్ట్ చేసింది! ఇందులో భాగంగా... 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో.. స్పేస్ లోకి వెళ్లే రాకెట్ లోని రెండు సీట్ల టిక్కెట్స్ ని అమ్మకాన్నికి పెట్టనునట్లు తెలిసింది.

ఈ టిక్కెట్లు గురువారం (24 అక్టోబర్ 2024) సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక, టిక్కెట్ ధర విషయానికొస్తే... 1.5 మిలియన్ యువాన్లుగా నిర్ణయించింది. సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ లో ప్రయాణికులను తీసుకెళ్తామని తెలిపింది. వచ్చే నెలలో మరిన్ని టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

మరోపక్క ఇతర చైనా కంపెనీలు కూడా అంతరిక్ష పర్యాటక రంగంలోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించాయి. ఇందులో భాగంగా... సీఏఎస్ స్పేస్ 2008 నాటికి అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.