Begin typing your search above and press return to search.

నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్ రాకెట్..

వీటిలో ముఖ్యమైనది అంతరిక్షంలో జరిగేటటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి చేసే స్పేస్ ఎక్స్పరిమెంట్స్.

By:  Tupaki Desk   |   10 Sep 2024 12:13 PM GMT
నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్ రాకెట్..
X

ప్రపంచంలో మన భూమిని దాటి ఈ విశాల విశ్వంలో అంతు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మన సృష్టి తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ఎక్స్పరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వీటిలో ముఖ్యమైనది అంతరిక్షంలో జరిగేటటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి చేసే స్పేస్ ఎక్స్పరిమెంట్స్.

ఇప్పటివరకు జరిగినవన్నీ ఒకే అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ నేతృత్వంలో సాగుతున్న’ స్పేస్ ఎక్స్’తొలిసారిగా అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ కోసం సరికొత్త ప్రయోగాన్ని సంధించింది. మీరు వింటున్నది నిజమే మనం మన ఇంటి ఎదురుగా ఉన్న గార్డెన్ లో వాకింగ్ కి వెళ్ళినట్లుగా వ్యోమగాములు స్పేస్ లో వాక్ చేయబోతున్నారు.

ఎలాన్ మస్క్ నెత్తురుత్వంలో సాగే ఈ స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ మిషను ఈరోజు ఫ్లోరిడాలోని నాసకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించింది. ఈ మిషన్ పూర్తిగా ఆరు రోజులపాటు సాగుతుంది. ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా సిబ్బందితోపాటు ఇద్దరు ప్రైవేట్ గా నిర్వహించే స్పేస్ వాక్కును వీక్షించడం ఈ మిషన్ స్పెషాలిటీ. ఈ మిషన్ ప్రారంభానికి నేడు తొలిరోజు కాగా మూడవరోజు అంతరిక్ష నడక జరగబోతున్నట్లు తెలుస్తోంది

స్పేస్ ఎక్స్ సంస్థ నలుగురిని భూ కక్షలోకి పంపించింది. ఈ కంపెనీకి సంబంధించిన క్యూ డ్రాగన్ క్యాప్సిల్ లో వ్యోమగాములు ప్రయాణం చేస్తున్నారు. మొత్తం పొలారిస్ ప్రోగ్రాం కోసం ప్లాన్ చేసిన మూడు మిషన్లలో ఈరోజు ప్రయోగించబడిన పొలారిస్ డాన్ మొదటిది. ఈ మేరకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 వ్యోమగాములతో నింగిలోకి దూసుకు వెళ్ళింది.