Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుంచి కిందకు వచ్చిన వ్యోమగాములు... వీడియో వైరల్!

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐ.ఎస్.ఎస్.) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి వచ్చారు

By:  Tupaki Desk   |   12 March 2024 3:45 PM GMT
అంతరిక్షం నుంచి కిందకు వచ్చిన వ్యోమగాములు... వీడియో వైరల్!
X

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐ.ఎస్.ఎస్.) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి వచ్చారు. ఈ క్రమంలో ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో జనాల్లో అంతరిక్షం నుంచి కిందకు దిగారు. వీరు అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగి వస్తున్న దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అవును... సుమారు ఆరు నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో పరిశోధనలు చేసిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి వచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాలుగు దేశాలకు చెందిన ఈ నలుగురు వ్యోమగాములూ గత ఏడాది ఆగస్టు 26న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పెస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - 9 రాకేట్ లో రోదసిలోకి వెళ్లారు.

ఆండ్రీస్‌ మోగెన్‌ సెన్‌ (యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ), జాస్మిన్‌ మాగ్‌ బెలి (నాసా), కొన్‌ స్తాంటిన్‌ బొరిసోవ్‌ (రాస్‌ కాస్మోస్‌), సతోషి ఫురుకవా (జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ)లు సుమారు 200 రోజులపాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా తమ విధులు ముగించుకుని వారు నలుగురూ తిరిగి భూమిపైకి ప్రయాణమై క్షేమంగా చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఐ.ఎస్.ఎస్. "వెల్ కం హోం" అంటూ పోస్ట్ చేసింది.

వాస్తవానికి వీరు ప్రయాణించే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సోమవారమే విడిపోగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున భూవాతావరణంలోకి వీరు ప్రయాణిస్తున్న డ్రాగన్ భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమలోనే ఫ్లోరిడా తీరంలోని జలాల్లో దిగింది. ఈ సమయంలో అప్పటికే ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న నేవీ సిబ్బంది... ఈ క్యాప్సుల్ ని రికవరీ చేసుకున్నారు.