Begin typing your search above and press return to search.

అడ్రస్సులు లేకుండా ఓడిపోతారు.... టీడీపీ బీజేపీ పొత్తుల మీద నిప్పురవ్వలు...!

తాము ప్రజలలో ఉంటే ఢిల్లీ పెద్దల ముందు చంద్రబాబు పవన్ సిద్ధం అంటూ తమ బలహీనతను చాటుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 12:30 PM GMT
అడ్రస్సులు లేకుండా ఓడిపోతారు....  టీడీపీ బీజేపీ  పొత్తుల మీద నిప్పురవ్వలు...!
X

బీజేపీతో టీడీపీ పొత్తు ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. అధికార వైసీపీ అయితే ఈ పొత్తు పెటాకులే అని అంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అంతా పొత్తుల విషయంలో శాపాలే పెడుతున్నారు. కొత్త సీసాలో పాత సారా అని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాము ప్రజలలో ఉంటే ఢిల్లీ పెద్దల ముందు చంద్రబాబు పవన్ సిద్ధం అంటూ తమ బలహీనతను చాటుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.

ఇక మంత్రులు ధర్మాన ప్రసాదరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు అయితే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా సింగిల్ గా వస్తాం, మేమే గెలుస్తామని చెబుతున్నారు. దీంతో పొత్తుల విషయంలో వైసీపీ గట్టిగానే టీడీపీని టార్గెట్ చేస్తోంది అని అర్ధం అవుతోంది.

ఇక వామపక్షాలు ఎటూ దీని మీద ఘాటుగానే రియాక్ట్ అవుతాయన్నది తెలిసిందే. బీజేపీతో సిద్ధాంతపరమైన విభేదాలు దశాబ్దాలుగా వామపక్షాలకు ఉన్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే టీడీపీ బీజేపీ పొత్తుల మీద నిప్పులే చెరిగారు. ఈ రెండు పార్టీలో పొత్తు ఏపీలో ఘోర ఓటమికే దారి తీస్తుందని ఆయన తన సర్వే రిపోర్టు వినిపించారు.

కనీసంగా కూడా ఉనికి చాటుకోలేరని అడ్రస్సులు లేకుండా పోతారని కూడా కామ్రేడ్ చెప్పాల్సింది చెప్పేశారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులను ఆయన విశ్వాసఘాతుకమైన పొత్తుగా అభివర్ణించారు. ఏపీకి బీజేపీ ఏమి చేసిందని టీడీపీ ఆ పార్టీతో కలుస్తోందని సీపీఎం నేత నిలదీశారు. ఏపీకి దారుణంగా ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆయన నిందించారు.

బీజేపీ మీద ఏపీ ప్రజలకు 2014 నాటి నమ్మకం లేదని అన్నారు. 2019 తరువాత ఆగ్రహం కూడా పెద్ద ఎత్తున ఏర్పడిందని, అది కాస్తా అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గలేదని అలాంటి పార్టీతో పొత్తుకు వెళ్ళి టీడీపీ తాను కూడా సర్వనాశనం కాబోతోందని ఆయన అంచనా కడుతున్నారు.

ఈ మూడు పార్టీల పొత్తుని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని ఎన్నికల తరువాత ఈ మూడు పార్టీలూ తన అడ్రస్సులు ఎక్కడా అని వెతుక్కోవాల్సిందే అని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీతో చేరుతున్న టీడీపీ తాను లౌకిక వాద పార్టీ అవునా కాదా అన్నది స్పష్టం చేయాల్నై కూడా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మొత్తం మీద బీజేపీతో పొత్తు అన్నది అధికారానికి దగ్గర దారి అని టీడీపీ జనసేన భావిస్తూంటే ఘోర ఓటమిని అది మార్గం అని కామ్రేడ్ అంటున్నారు. మరి ఆయన అంచనాలు నిజమవుతాయా లేక చంద్రబాబు వ్యూహాలు సక్సెస్ అవుతాయా అన్నది చూడాల్సి ఉంది.