Begin typing your search above and press return to search.

జనసేన ఎమ్మెల్యే చీరపై డిప్యూటీ స్పీకర్ ఆరా.. వీడియో వైరల్!

ఇందులో భాగంగా... ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి.. చేనేత రంగంపై మాట్లాడారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 10:00 AM GMT
జనసేన ఎమ్మెల్యే చీరపై డిప్యూటీ స్పీకర్  ఆరా.. వీడియో వైరల్!
X

ఏపీ అసెంబ్లీ ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... డిప్యూటీ సభాపతిగా తన మార్కు చూపిస్తూ ఆకట్టున్నారు ట్రిపుల్ ఆర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యలో మంగళవారం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఓ మహిళా ఎమ్మెల్యే చీర గురించి రఘురామ ఆరా తీశారు!

అవును... ఏపీ అసెంబ్లీలో తాజాగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి.. చేనేత రంగంపై మాట్లాడారు. గుజరాత్ లో బీజోడీ అనే గ్రామంలో కూలీలు కాస్తా నేతన్నలుగా మారి అధిక లాభాలు ఆర్జిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం నేతన్నలు మగ్గాలు మూసుకొని కూలీలుగా మారిపోతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉందని.. ముడిసరుకుల ధరలు పెరగడం దీనికి ఒక కారణమని.. పెరిగిన ధరలతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారని.. ఫలితంగా రాష్ట్రంలో సుమారు 50 శాతం మగ్గాలు మూతపడిపోయాయని ఆమె తెలిపారు. అయితే... ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల న్యాయం జరుగుతుందని చేతలు భావిస్తున్నారని లోకం మాధవి తెలిపారు.

ఈ క్రమంలో.. నెలకు నికర ఆదాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలు నేతన్నలకు వచ్చేలా ఆలోచించాలని కోరుతున్నట్లు మాధవి పేర్కొన్నారు. ఇదే సమయంలో... నేతన్నలకు ఇళ్లు ఇచ్చేటప్పుడు వారికి ఇంటి స్థలంతో పాటు షెడ్లు కట్టుకోవడానికీ బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఇదే క్రమంలో... ప్రభుత్వ ఉద్యోగులు అంతా నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించేలా ప్రత్యేకంగా ప్రభుత్వం నిబంధన పెట్టేలా చొరవ తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ... “మీరు ఇప్పుడు ధరించిన చీర చేనేతదేనా?” అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. దీంతో.. ఆమె "చేనేతేనండి" అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి ముగించారు!

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇదే సమయంలో.. నెలలో ఒక రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అంతా చేనేత వస్త్రాలు ధరించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలనే ఆలోచన కూడా... ఆ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడే సూచనే అని అంటున్నారు పరిశీలకులు!