Begin typing your search above and press return to search.

శ్రీజేశ్ క్యూట్ లవ్ స్టోరీ బయటకు.. హాకీ స్టిక్ పై ఆమె పేరు

ఒలింపిక్స్ లో కాంస్యం లభించిన తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించిన ఇతడు.. తాజాగా ఒక మీడియాసంస్థకు తన క్యూట్ లవ్ స్టోరీని షేర్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 6:30 AM GMT
శ్రీజేశ్ క్యూట్ లవ్ స్టోరీ బయటకు.. హాకీ స్టిక్ పై ఆమె పేరు
X

క్రికెట్ ను మతంగా భావించే దేశంలో మరో క్రీడకు ప్రాధాన్యత అన్నది కష్టమే. ఆటకే పెద్దగా గుర్తింపు లేనప్పటికీ.. భారత హాకీ స్టార్ శ్రీజేశ్ మాత్రం అత్యధికులకు తెలుసు. అదిరే టాలెంట్ తో పాటు.. ప్రత్యర్థికి తన ఆటతో చుక్కలు చూపించే ఇతగాడి కారణంగానే ఒలింపిక్ క్రీడల్లో కాంస్యాన్ని చేజిక్కించుకోవటం తెలిసిందే. అతడే.. సీనియర్ గోల్ కీపర్ ఆర్పీ శ్రీజేశ్. ప్రత్యర్థుల గోల్ ఆశల్ని వమ్ము చేస్తూ.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అన్న పేరుకు తగ్గట్లే.. గోల్ పోస్టులోకి దూసుకెళ్లే బంతిని అడ్డుకుంటూ ఉంటారు.

ఒలింపిక్స్ లో కాంస్యం లభించిన తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించిన ఇతడు.. తాజాగా ఒక మీడియాసంస్థకు తన క్యూట్ లవ్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. సినిమాటిక్ గా ఉన్నఈ ప్రేమకథ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఒక టైంలో తాను అమితంగా ద్వేషించిన (సరిగానే చదివారు) అమ్మాయినే ప్రేమించటం.. పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతగాడి లవ్ స్టోరీలోకి వెళితే.. ‘‘కేరళలోని కన్నూర్ క్రీడా పాఠశాలలో చదువుతున్న రోజుల్లో తను(అనీశ్య) కూడా చేరింది. ఆమె రాక ముందు స్కూల్లో తననే అందరూ ఇష్టపడేవారు. క్లాస్ లో టాపర్. సూపర్ స్టార్. టీచర్లకు ఫేవరెట్ స్టూడెంట్ ను కూడా. ఎప్పుడైతే తను వచ్చిందో నాకున్న టైటిల్స్ మొత్తం లాగేసుకుంది. అప్పట్లో నేనుయాభై మార్కులకు 35-42 మార్కుల మధ్యన వచ్చేవి. కానీ.. ఆమె మాత్రం 50 మార్కులకు 49 మార్కుల్ని సాధించేది. అందరికి ఆమె అంటే ఇష్టం. నాకు మాత్రం ఆమె అంటే ద్వేషంగా ఉండేది. ఆ తర్వాత శత్రువులం అయ్యాం. ఆమెను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. కానీ.. ఎలా జరిగిందో.. ఏంజరిగిందో ఇప్పటికి అర్థం కాదు. ఆమెను తెగ ద్వేషించే నేను ప్రేమించటం మొదలు పెట్టా. ఇద్దరం ప్రేమలో మునిగిపోయాం’’ అంటూ అప్పటి సంగతుల్ని బయటపెట్టాడు.

వీరి ప్రేమకు ఇరు కుటుంబాల్లోనూ ఆమోదం లభించింది.దీంతో 2013లో వీరిద్దరు వివాహ బంధంతోఒక్కటయ్యారు. ప్రొఫెషన్ పరంగా అనీశ్య ఆయుర్వేద వైద్యురాలు. అయినప్పటికీ తన ఆట విషయంలో తనకెంతో అండగా నిలిచేదన్న శ్రీజేశ్.. భార్య మీద ఉన్న ఇష్టంతోనే హాకీ స్టిక్ మీద ఆమె పేరును ప్రత్యేకంగా రాయించుకున్నాడు. వీరి అన్యోన్య వైవాహిక జీవితానికి తగ్గట్లే.. వీరికో కొడుకు (శ్రీఅన్ష్) కుమార్తె (అనుశ్రీ)లు ఉన్నారు. భార్య పేరు మాత్రమే కాదు.. ఇద్దరు పిల్లల పేర్లు తన హాకీ స్టిక్ మీద రాయించుకున్న ఇతగాడు.. పలువురి కంట్లో పడ్డాడు. ఇతగాడి లవ్ స్టోరీ వైరల్ గా మారింది.