Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ వీడియో... శ్రీరాముడి భక్తులను టచ్ చేస్తోన్న శ్రీలంక యాడ్!

అవును... శ్రీలంక ఎయిర్ లైన్స్ కు సంబంధించిన ఓ ప్రకటన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రకటన శ్రీరాముని భక్తులను బాగా ఆకర్షిస్తోందని అంటునారు.

By:  Tupaki Desk   |   11 Nov 2024 4:21 AM GMT
ట్రెండింగ్  వీడియో... శ్రీరాముడి భక్తులను టచ్  చేస్తోన్న శ్రీలంక యాడ్!
X

కొన్ని ప్రకటనలు చికాకు తెప్పించేవిగా, మరికొన్ని ఏమాత్రం లాజిక్ లేనివిగా, మరికొన్ని ప్రోడక్ట్ కి ప్రకటనకూ ఏమాత్రం పొంతన లేనట్లుగా ఉన్నాయని చెబుతుంటే... మరికొన్ని పాత్రం పెర్ఫెక్ట్ గా ఉందన్ని, యాప్ట్ గా సూటయ్యిందనే కామెంట్లను దక్కించుకుంటుంటాయి. ఈ క్రమంలో శ్రీరాముడి భక్తులకు గూస్ బంప్స్ వచ్చేలా ఓ ప్రకటన వైరల్ గా మారింది.

అవును... శ్రీలంక ఎయిర్ లైన్స్ కు సంబంధించిన ఓ ప్రకటన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రకటన శ్రీరాముని భక్తులను బాగా ఆకర్షిస్తోందని అంటునారు. హిందూ ఇతిహాసం రామాయణానికి సంబంధించిన విషయాలు చెబుతూ.. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, ప్రదేశాలను చూపిస్తూ చిత్రీకరించిన విధానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

సుమారు ఐదు నిమిషాలు ఉన్న ఈ వీడియో "రామాయణ ట్రయల్"లో వీక్షకులను తమ దేశానికి రావలాని ఆహ్వానిస్తూ... తమ దేశమంతటా రామాయణానికి సంబంధించిన ఐకానిక్ సైట్స్ ఉన్నాయని చెబుతుంది! ఈ సందర్భంగా లేవనెత్తిన అంశాలు, ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్న దృశ్యాలు శ్రీరాముని భక్తుల నుంచి, హిందూ సమాజం నుంచి ప్రశంసలు పొందుతోంది.

తమ దేశాన్ని టూరిజం డెస్టినేషన్ గా ప్రమోట్ చేయడానికి శ్రీలంక ఉద్దేశించిన ప్రకటనలో... సీతను రావణుడు దాచి ఉంచాడని నమ్మే 'ఎల్లా' సమీపంలోని గుహ వంటి ప్రదేశాలతో పాటు తమిళనాడులోని రామేశ్వరాన్ని, శ్రీలంక తీరానికి కలుపుతూ వానర సైన్యం నిర్మించినట్లు చెప్పబడే 'రామసేతు' అనే పౌరాణిక వంతెనను కూడా ఈ వీడియో ప్రస్తావించింది.

ఈ ప్రకటనలో పిల్లవాడు... "వంతెన ఇంకా ఉందా?" అని అడగ్గా... "అవును... మనం ఈ రోజు కూడా దీన్ని చూడోచ్చు" అని అతడి గ్రాండ్ మధర్ సమాధానం ఇచ్చారు! ఈ విధంగా ఇండియన్ టూరిస్టులను, శ్రీరాముడి భక్తులను ఆకర్షించేలా ఉన్న ఈ ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా... గత ఏడాది భారత్ - శ్రీలంక దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన రామాయణ ట్రైల్ ప్రాజెక్ట్ లో సహకరించడానికి అంగీకరించాయి. ఈ మేరకు జూలై 2023న ఢిల్లీలో ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో ఇది ప్రకటించబడింది. ఈ సమయంలో ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!