Begin typing your search above and press return to search.

పీఠ భూమి కదిలింది...శారదా ఇదేమిటి తల్లీ ?

ఇపుడు అదే పరిస్థితి విశాఖ శ్రీ శరదాపీఠానికి ఏర్పడింది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:45 AM GMT
పీఠ భూమి కదిలింది...శారదా ఇదేమిటి తల్లీ ?
X

ఆధ్యాత్మికం అంటే పవిత్రంగా పద్ధతిగా ఉండాలి. రాజకీయాల్లోకి అసలు చొరబడకూడదు, రాజకీయం అంటే ఎపుడూ ఘర్షణగా ఉంటుంది. అధికారం ప్రతిపక్షం దానికి వెలుగు నీడలు. అందుకే ఒక పార్టీ వైపు ఉంటే రెండవ పార్టీ పవర్ లోకి వచ్చినపుడు ఇలాగే ఇబ్బంది వస్తుంది

ఇపుడు అదే పరిస్థితి విశాఖ శ్రీ శరదాపీఠానికి ఏర్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం వద్ద ఏకంగా 15 ఎకరాల భూమిని కారు చౌకగా అంటే ఎకరం లక్ష రూపాయలకు గానూ గత వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అలా 220 కోట్ల విలువ చేసే భూమిని పీఠానికి కట్టబెట్టారని ఆనాటి నుంచే టీడీపీ జనసేన ఆరోపణలు చేస్తూ వచ్చాయి.

ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో ఈ భూ కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పీఠానికి భారీ షాక్ తగింది. వాస్తవానికి ఈ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం తొందర పడలేదు. అన్నీ పద్ధతి ప్రకారమే చేసుకుంటూ వెళ్ళింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూముల మీద ఉన్నత స్థాయి అధికారులతో ఒక దర్యాప్తుని నియమించింది. ఆ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే శారదాపీఠం మీద చర్యలు తీసుకుంది అని అంటున్నారు. దీంతో శారదాపీఠానికి ఇది ఇబ్బందిగా మారింది అని అంటున్నారు.

వైసీపీ హయాంలో ఈ భూములను తీసుకునేటపుడు వేద విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పారని అంటున్నారు. ఆ తరువాత చూస్తే కనుక దానిని వాణిజ్య అవసరాల కోసం వాడుకునేందుకు ప్రభుత్వానికి అర్జీ పెట్టడం దానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఓకే చేయడం జరిగిపోయింది.

అయితే అప్పట్లోనే అధికారులు మరీ ఎకరం లక్ష రూపాయలు ఏమిటి అని దానికి కోటి రూపాయలు అయినా విధిస్తే పదిహేను కోట్ల రూపాయల దాకా సర్కార్ కి వచ్చేది అని చెప్పారని అంటున్నారు. మరీ ఇంత కారు చౌకగా ఈ భూములు ఇవ్వడం ఒక వివాదం అయితే ఈ భూమూలో మొదట చెప్పినట్లుగా వేద విశ్వవిద్యాలయానికి కట్టుబడి ఉన్నా ఈ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం వేరేగా ఆలోచించి ఉండేదని అంటున్నారు. అలా కాకుండా వాణిజ్యపరమైన అవసరాలకు భూమిని వాడుకునేలా సవరణలు చేయించుకోవడంతోనే దీని మీద కూటమి నేతలు గట్టిగానే బిగించారు అని అంటున్నారు.

ఇక ఈ భూములతో పాటు తిరుమల కొండల మీద నిబంధలనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పీఠ భూములు కదిలిపోతున్నాయి. ఇదేమిటి అన్నదే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని అంటున్నారు.