Begin typing your search above and press return to search.

విశాఖ రాజధానిపై శ్రీభరత్... ఈ లాజిక్స్ అన్నీ మిస్సయ్యారు!

అయితే.. ఈ విషయంలో టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ స్పందించిన విధానం వైరల్ గా మారింది. అమరావతే రాజధానిగా ఉండాలి.. దాన్ని చంపేయకూడదు.. రోడ్లు వేసి, ప్రైవేటు పెట్టుబడులు వస్తే డెవలప్ అవుతుంది అని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2024 2:30 PM GMT
విశాఖ రాజధానిపై శ్రీభరత్... ఈ లాజిక్స్  అన్నీ మిస్సయ్యారు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని చంద్రబాబు ప్రకటించడం.. జూన్ 4న తాను ముఖ్యమంత్రిగా ఏపీ రాజధాని విశాఖలోనే ప్రమణస్వీకారం చేస్తానని, ఇకపై విశాఖే ఏపీ రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతీ తెలిసిందే.

అయితే.. ఈ విషయంలో టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ స్పందించిన విధానం వైరల్ గా మారింది. అమరావతే రాజధానిగా ఉండాలి.. దాన్ని చంపేయకూడదు.. రోడ్లు వేసి, ప్రైవేటు పెట్టుబడులు వస్తే డెవలప్ అవుతుంది అని చెబుతున్నారు. అదేవిధంగా... అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చాలా అవసరం.. అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయదగిన పోజిషన్‌ లో స్టేట్‌ గవర్నమెంట్‌ లేదు అని తెలిపారు.

ఇదే సమయంలో... అమరావతి అనేది ఒక 20 ఏళ్ల స్టోరీ.. ఆంధ్రప్రదేశ్ కి విశాఖ గ్రోత్ ఇంజిన్‌ గా ఉంటుంది.. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది.. విశాఖ అభివృద్ధి వల్ల రాష్ట్రం కూడా వేగంగా డెవలప్ అవుతుంది.. అని శ్రీభరత్ చెప్పుకొచ్చారు. అవును... ఈ విషయం వాస్తవమే! అంటే... ఫైనల్ గా ఆయన చెప్పిందేమిటంటే... రాజధాని, ఆర్ధిక రాజధాని ఒకటే ఉండాల్సిన అవసరం లేదు అని!

రాజధానిగా అమరావతిలో కాస్త రోడ్లు, బేసిక్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేసి, "ప్రైవేటు" పెట్టుబడులు వస్తే ఆ విధంగా పెరుగుతుందే తప్ప వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం లేమని! రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖ ఉంటుందని.. అది అభివృద్ధి చెందుతుందని చెబుతూ... దేశానికి “ఢిల్లీ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని” అనే విషయం అంతా గమనించాలని రెండు మూడు ఉదాహరణలు చెప్పారు!

వాస్తవానికి 2014లో చంద్రబాబు కూడా శ్రీభరత్ లా ఆలోచించి ఉంటే ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంలా ఏపీ ఉండేది కాదని అంటున్నారు పరిశీలకులు. కేవలం ఆ ప్రాంతంలోనే అన్నీ ఏర్పాటు చేయాలని, రెండు పంటలు పండే అన్ని వేల ఎకరాలు తీసుకుని.. అటు ఇటు కాకుండా చేశారని చెబుతున్నారు. నాడు... సచివాలయం, హైకోర్టు, మొదలైనవి పర్మినెంట్ భవనాలతో కట్టి ఉంటే ఈ సమస్యే లేదు!

ఇప్పుడు ముంబై, ఢిల్లీ వంటి మాటలు అప్పుడు కచ్చితంగా సూటయ్యేవే!... ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు!! అయితే... ఎన్నికల వేళ శ్రీభరత్ మాత్రం విశాఖపై తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం మాత్రం వైరల్ గా మారింది. దీంతో... ఈ వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలూ పెరిగిపోతున్నాయి. ఇది కేవలం ఎన్నికల వేళ విశాఖ ప్రజలను ఏమార్చే కార్యక్రమంలో భాగమనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణాలూ ఉన్నాయి!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... విశాఖపట్నమే ఏపీ రాజధాని.. పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండా ఎదిగే శక్తి విశాఖకు ఉంది.. ఫలితంగా ఏపీకి విశాఖ అనేది గ్రోత్ ఇంజిన్ గా ఉపయోగపడుతుంది.. ఇదే సమయంలో పక్కనున్న వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అని జగన్ ఐదేళ్లుగా చెబుతూనే ఉన్నారు.

ఇదే సమయంలో తనకు అమరావతిపై ద్వేషం లేదని.. ఇదే సమయంలో ఇప్పుడు అన్ని వేల కోట్లు పెట్టి కేవలం కొన్ని వేల ఎకరాలను మాత్రమే అభివృద్ధి చేసి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టలేమని, ఆత్మవంచన చేసుకోలేమని అంటున్నారు. అందుకే అమరావతికి శాసన రాజధాని హోదా ఇచ్చి.. ఇప్పుడు శ్రీభారత్ చెబుతున్నట్లు రోడ్లేసి, చిన్నగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేసి ఉన్నారు! అంతేతప్ప అమరావతిని చంపేయలేదు!

అయితే... విశాఖ విషయంలో జగన్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. ఇంతకాలం జగన్ చెప్పిన మాటలను బలపరుస్తూ.. అన్నీ చెప్పి ఆఖరిలో కేవలం "ఆర్థిక రాజధాని" అనే పదాన్ని మాత్రం పలుకుతూ.. శ్రీభరత్ ఓట్ల కోసం ఈ తరహా కబుర్లు చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదే సమయంలో... “దేశానికి ఢిల్లీ రాజధాని, ముంబై ఆర్ధిక రాజధానే కానీ... మహారాష్ట్ర రాష్ట్రానికి మాత్రం ముంబై మాత్రమే రాజధాని అని, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మాత్రమే రాజధాని అని, కర్ణాటకకు బెంగళూరే రాజధాని అని, తమిళనాడుకు చెన్నై మాత్రమే రాజధాని అని గుర్తుచేస్తున్నారు!

ఇదే సమయంలో... ఉత్తరాంధ్రా ప్రజలంటే వెనుకపడిన వారని, ఇట్టే మోసం చేయవచ్చుననే భావన ఒకప్పుడు ఉండేది కానీ.. ఇప్పుడు కూడా శ్రీభరత్ తమని అలాగే అనుకుంటున్నాడా? అని అంటున్నారట విశాఖ వాసులు! అదేవిధంగా... విశాఖ రాజధాని విషయంలో ప్రజల మనోభావాలతో ఆటలాడితే మాత్రం ఈ పార్టీ, ఆ పార్టీ అనే తారతమ్యాలు లేకుండా అంతా కలిసి ఓటుతో బుద్ధి కమ్ గుణపాఠం చెబుతారని శ్రీభరత్ ను హెచ్చరిస్తున్నారట!!

పైగా విశాఖ రాజధాని విషయంలో చంద్రబాబు, బాలయ్య, వారి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాలుక మడత మాటలు మాట్లాడినా.. నమ్మే పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రజలు లేరని.. విశాఖ వాసులు ఈ విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారని.. "ఉత్తరాంధ్ర వాసులను ఏమార్చడానికి శ్రీభరత్ మంచి ప్రయత్నమే చేసినా.. ఆ పాచిక పారలేదని" ఎద్దేవా చేస్తున్నారని తెలుస్తుంది!

ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే... ప్రస్తుతం విశాఖ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ ముందంజలో ఉన్నారని అంటున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాలు అలాగే ఉంటాని నొక్కి చెబుతున్నారు! విశాఖలో సామాన్యులు ఎవరిని కదిపినా ఆమె గెలుపు పక్కా అని అంటున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో... పోలింగ్ కు ముందే ఎంపీగా బొత్సా ఝాన్సీ గెలవడం ఖాయమని తెలిసిన తర్వాత... శ్రీభరత్ చివరి ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే కామెంట్లూ సామాన్య ప్రజానికంతో పాటు, టీడీపీ కేడర్ లోనూ వినిపిస్తుండటం గమనార్హం!