Begin typing your search above and press return to search.

మూడ్ ఆఫ్ శ్రీకాకుళం...!

ఉత్తరాంధ్రాలో కీలకమైన జిల్లాగా శ్రీకాకుళం ఉంది. ఈ జిల్లాలో రాజకీయ తీర్పులు ఎపుడూ విలక్షణంగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 4:03 AM GMT
మూడ్ ఆఫ్ శ్రీకాకుళం...!
X

ఉత్తరాంధ్రాలో కీలకమైన జిల్లాగా శ్రీకాకుళం ఉంది. ఈ జిల్లాలో రాజకీయ తీర్పులు ఎపుడూ విలక్షణంగా ఉంటాయి. అంతే కాదు ఆసక్తికరంగా కూడా ఉంటాయి. వెనకబడిన ఈ జిల్లా రాజకీయ చైతన్యంలో మాత్రం ఏనాడూ వెనకబడలేదు. ఎప్పటికపుడు మారుతున్న రాజకీయ సామాజిక వాతావరణాన్ని అందిపుచ్చుకుంటూ వినూత్న తీర్పులు ఇస్తూ రాజకీయ పార్టీలకు షాకులు ఇస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే మూడ్ ఆఫ్ ఉత్తరాంధ్రాలో భాగంగా ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల మీద ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది తేటతెల్లమైంది. ఈ సర్వే ప్రకారం చూస్తే అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన కూటముల బలబలాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలా మేరకు జనాభిప్రాయంగా ఒడిసిపట్టారు. అయితే ఇవి కేవలం పార్టీల మీద అభిమానంతో జనాలు చెప్పిన అభిప్రాయాలు రేపటి రోజున అభ్యర్ధులు అటూ ఇటూ పోటీకి దిగితే మార్పులు కూడా ఉంటాయని సదరు సర్వే కర్తలు చెప్పడమూ జరిగింది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం లోని పది జిల్లాలలో రాజకీయ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.

పలాస లో హోరా హోరీ పోరు సాగేలా ఉందని సర్వే తేల్చింది. టీడీపీ జనసేన కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తే వైసీపీకి 47 శాతం ఓటు షేర్ వస్తుందని, ఇతరులకు రెండు శాతం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతం ఉంటుందని పేర్కొంది.

పాతపట్నంలో చూస్తే టీడీపీకి కూటమికి 50 శాతం ఓటు షేర్, వైసీపీకి 46 శాతం ఓటు షేర్ ఉంటే ఇతరులకు 2.25 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.75 శాతంగా లెక్క తేల్చింది. ఇక్కడ నాలుగు శాతం లీడ్ తో టీడీపీ కూటమి వైసీపీ మీద ముందు ఉంది అన్నది ఈ సర్వే సారాంశం.

శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో టీడీపీ కూటమికి 47.5 శాతం ఓటు షేర్ ఉంటే, వైసీపీకి 49 శాతం ఓటు షేర్ ఉంది, ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది అని పేర్కొంది. ఇక్కడ కూడా హోరా హోరీ పోరు తప్పదని స్పష్టం చేసింది.

ఆముదాలవలసలో టీడీపీ కూటమికి 51 శాతం ఓటు షేర్ ఉంటే వైసీపీకి 46 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 1.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది. ఇక్కడ అయిదు శాతం లీడ్ తో టీడీపీ వైసీపీ మీద కొనసాగుతోంది.

ఎచ్చెర్లలో చూసుకుంటే టీడీపీ కూటమికి 52 శాతం వైసీపీకి 44 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతం ఉన్నాయి. ఇక్కడ ఏకంగా టీడీపీ కూటమి 8 శాతం ఓట్ షేర్ తో స్పష్టమైన ఆధిక్యతను వైసీపీ మీద చూపిస్తోంది.

నరసన్నపేటలో వైసీపీ 51.5 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ కూటమి 45.5 శాతం ఓటు షేర్ తో ఉంది. ఇతరులకు 1.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది. ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమి మీద ఆరు శాతం ఓటు షేర్ తో స్పష్టమైన లీడ్ తో కొనసాగుతోంది.

రాజాం ఎస్సీ రిజర్వుడు సీటులో చూస్తే టీడీపీ కూటమికి 51 శాతం, వైసీపీకి 45 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కి 2 శాతం ఉంది. ఇక్కడ ఆరు శాతం ఓటింగ్ తో టీడీపీ కూటమి ఉంది.

పాలకొండ ఎస్సీ నియోజకవర్గం లో వైసీపీకి 50.5 శాతం ఓటు షేర్ టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 2.5 శతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతం ఉన్నాయి. ఇక్కడ వైసీపీ 5.5 శాతం ఓటు షేర్ లీడింగ్ తో కొనసాగుతోంది.

ఇచ్చాపురం తీసుకుంటే ఇక్కడ వైసీపీ 49.5 శాతం టీడీపీ కూటమి 48.5 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. ఇతరులకు 1 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1 శాతం ఉన్నాయి. ఇక్కడ హోరా హోరీ పోరు తప్పదని తేలుతోంది.

టెక్కలిలో చూసుకుంటే టీడీపీ కూటమికి 49.5 శాతం, వైసీపీకి 46.5 శాతం ఓటు షేర్ కనిపిస్తోంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కి 2 శాతం గా ఉంది. ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద మూడు శాతం ఓటు షేర్ ఆధిక్యతతో ఉంది.