Begin typing your search above and press return to search.

సిక్కోలు సీనియర్లకు టిక్కెట్ల టెన్షన్...!?

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో పలువురు వైసీపీ నేతలకు టికెట్ టెన్షన్ పట్టుకుందా అన్నది చర్చకు వస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 9:30 AM GMT
సిక్కోలు సీనియర్లకు టిక్కెట్ల టెన్షన్...!?
X

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో పలువురు వైసీపీ నేతలకు టికెట్ టెన్షన్ పట్టుకుందా అన్నది చర్చకు వస్తోంది. సాక్షాత్తు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి టికెట్ దక్కుతుందా అన్నది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన ఆముదాలవలస నుంచి రెండు దశాబ్దాల తరువాత జగన్ వేవ్ లో గెలిచారు. ఈసారి ఆయన టికెట్ ఏమి చేస్తారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది.

ఇంకో వైపు చూస్తే పాతపట్నం నుంచి రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కంటిన్యూ చేస్తారా లేదా అన్నది మరో క్వశ్చన్ మార్క్ గా ఉంది. పాలకొండలో రెండుసార్లు గెలిచిన విశ్వసరాయి కళావతి టికెట్ విషయంలోనూ డౌట్లు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఎచ్చెర్ల టికెట్ సంగతి కూడా నాలుగవ జాబితాలో తేలనుంది అని అంటున్నారు.

ఇక మంత్రి ధర్మాన ప్రసాదరావు సీటు విషయం తీసుకుంటే అక్కడ నుంచి ఆయనను ఎంపీగా పోటీ చేయమని అధినాయకత్వం కోరింది. ఆయన తాను తప్పుకుని తన కుమారుడు ధర్మాన రామ్ మనోనహర్ నాయుడుకు ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నారు. వైసీపీ అయితే కొత్త ముఖానికి చోటివ్వాలని చూస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి బలంగా ఉన్నారు.. 2019లో టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తేనే ఆమె అయిదువేల ఓట్ల తేడాతో ఓడారు.

ఈసారి పొత్తు ఉంటుంది కాబట్టి ఇబ్బంది కలగవచ్చు అన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట. దాంతో ధర్మాన ప్రసాదరావుకి ఎంపీ సీటుని ఇస్తామన్నారని టాక్. ఆయన నో చెప్పడంతో అక్కడ నుంచి పేడాడ తిలక్ ని పోటీ చేయిస్తున్నారు. దాంతో మరోసారి మంత్రికి టికెట్ ఇస్తారా లేదా అన్నది చూడాలని అంటున్నారు.

అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో అదే సస్పెన్స్ ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో కూన రవికుమార్ బలంగా ఉన్నారు. ఆయనకు తోడుగా జనసేన ఉంది. వైసీపీలో వర్గ పోరు గట్టిగా ఉంది. దాంతో స్పీకర్ కి నచ్చచెప్పి ఎంపీగా పోటీకి రెడీ చేయాలనుకున్నారని ప్రచారం సాగింది. ఆయన నో చెప్పారని అంటున్నారు. ఇపుడు ఈ ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా వైసీపీ హై కమాండ్ ఏమి చేయబోతోంది అన్న చర్చ సాగుతోంది.

అలాగే పాతపట్నం రెడ్డి శాంతికి ఈసారి టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఒక చోట ఓడింది. ఇక విశ్వసరాయి కళావతి తానే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. దాంతో ఆ సీటు ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి. ఎచ్చెర్లలో చూస్తే కిమిడి కళా వెంకటరావు కుటుంబం బలంగా ముందుకు వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పట్ల పార్టీలొనే వ్యతిరేకత ఉంది. దాంతో అక్కడ కచ్చితంగా మారుస్తారు అని అంటున్నారు. చూడాలి మరి నాలుగవ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయో అని అంటున్నారు. పండుగ తరువాత లిస్ట్ రిలీజ్ అని అంటున్నారు.