వైసీపీకి ఆయనే రియల్ హీరో...పవనొచ్చినా పోటీకి రెడీ...!?
గతంలో పోటీ చేసిన వ్యక్త్రి సినిమా హీరో మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తాను అని అంటున్నారు. ఆయన కేరెక్టర్‌ని చూశారు.
By: Tupaki Desk | 30 Dec 2023 3:34 AM GMTభీమవరం మరోసారి రాజకీయంగా సంచలనం కానుందా. వచ్చే ఎన్నికల్లోనూ అందరి దృష్టి భీమవరం వైపు పడాల్సిందేనా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి. భీమవరం వైసీపీ అభ్యర్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభా సాక్షిగా ప్రకటించేశారు అనుకోవాలి.
ముఖ్యమంత్రి హోదాలో భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని పొగడ్తలతో ముంచేసారు. రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ గట్టిగానే కితాబు ఇచ్చారు. సినీ హీరో ఒకాయన గతసారి పోటీ చేసిన రియల్ హీరోగా నిలబడి గెలిచారు అని కూడా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు.
గతంలో పోటీ చేసిన వ్యక్త్రి సినిమా హీరో మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తాను అని అంటున్నారు. ఆయన కేరెక్టర్‌ని చూశారు. కానీ మీ ముందు నేను రియల్ లైఫ్ హీరోని నిలబెడుతున్నాను అని గ్రంధి శ్రీనివాస్ ని సభకు సీఎం జగన్ పరిచయం చేశారు. కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం అప్పట్లో నా దగ్గరకు వచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని చెప్పిన వారు శ్రీనివాస్ అని జగన్ చెప్పడం విశేషం.
ఎమ్మెల్యే శ్రీనివాస్ భీమవరాన్ని జిల్లా హెడ్‌క్వార్టర్ చేస్తే చాలు అన్నారు. అందుకే ఆయన రియల్ లైఫ్ హీరో అని జగన్ మెచ్చుకున్నారు. రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతారని జగన్ చెప్పుకొచ్చారు. భీమవరం ప్రాంత అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీ రూ.39 కోట్ల ఖర్చయ్యే లెవెలింగ్ వర్కు మంజూరు చేయాలని శ్రీనివాస్ కోరారని, దాన్ని మంజూరు చేస్తున్నాను అని జగన్ హామీ ఇచ్చారు.
అలాగే అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంజూరు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. మొత్తానికి శ్రీనివాస్ ని రియల్ హీరో అంటూ పవన్ గురించి ఆయన మళ్లీ భీమవరంలో పోటీ చేసే విషయం గురించి సభకు జగన్ గుర్తు చేశారు. రియల్ హీరోనే మీ ముందు పెట్టాను ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని జగన్ అన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో మరో మారు గ్రంధి శ్రీనివాస్ భీమవరం వైసీపీ అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు.
పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన మీద మళ్లీ శ్రీనివాస్ సరైన క్యాండిడేట్ అని వైసీపీ హై కమాండ్ డిసైడ్ అయిందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.