జలీల్‌ఖాన్‌తో శ్రీనివాస్‌కు వివాదం.. బిగ్ డ్యామేజీ!
ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్‌ఖాన్‌తోనూ డీఎస్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 29 Jun 2024 6:34 AM GMTకాంగ్రెస్ దిగ్గజ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అనేక మంది నాయకులను చూశారు. ఎంతో మంది ముఖ్య మంత్రుల వద్ద కూడా.. పనిచేశారు. అయితే.. ఆయనపై ఎప్పుడూ.. ఎవరూకూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా అవినీతి ఆరోపణలు అసలే చేయలేదు. కానీ, రాజకీయ జీవితంలో తొలిసారి డీఎస్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది 2009 ఎన్నికలకు ముందు. అది కూడా.. ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.
ఈ సమయంలో విజయవాడలో ఆయన రెండు రోజులు బస చేశారు. ఉమ్మడి కృష్నా జిల్లాకు చెందిన నాయకులను కలిశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్‌ఖాన్‌తోనూ డీఎస్ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో భాగం కాకపోయినా.. డీఎస్.. అనుకోకుండా.. జలీల్‌ఖాన్ ఇంటికి వెళ్లారు. అనంతరం.. ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. తర్వాత.. కొన్నాళ్లకు.. జలీల్‌ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. డీఎస్ కేంద్రంగా అవినీతి ఆరోపణలు చేశారు.
``నాకు పీసీసీ చీఫ్ పదవిని ఇప్పిస్తానని శ్రీనివాస్ మాటిచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర 50 లక్షలు తీసుకున్నారు. పీసీసీ చీఫ్ మాత్రం నాకు కాకుండా వేరేవారికి ఇచ్చారు. ఆయన అవినీతిపై.. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి. నా సొమ్ములు నాకు తిరిగి ఇవ్వాలి`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు జలీల్‌ఖాన్. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. పార్టీలో విశ్వసనీయ నాయకుడిగా పేరున్న ధర్మపురిపై వచ్చిన ఈ విమర్శలను.. ముందు పార్టీ పట్టించుకోలేదు.
కానీ, తర్వాత.. తర్వాత.. జలీల్‌ఖాన్.. ఈ వేడిని కొనసాగించారు. దాడిని కూడా పెంచారు. అంతేకాదు.. ఒక వ్యక్తిని మీడియా ముందుకు తెచ్చి.. ``ఈయన సమక్షంలోనే 50 లక్షలు ఇచ్చాను`` అంటూ.. చెప్పుకొచ్చా రు. దీంతో విషయం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ధర్మపురి శ్రీనివాస్ వెళ్లి సమాధానం చెప్పుకోవడమే కాదు.. పీసీసీ పదవిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి డీఎస్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అనంతర కాలంలో వైఎస్ మరణంతో మారిన రాజకీయాలు కూడా.. ఆయనకు ఇబ్బందిగానే మారాయి. అయితే.. ఇప్పటికీ.. జలీల్‌ఖాన్ నిజంగానే సొమ్ము ఇచ్చారా? డీఎస్ తీసుకున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.