కార్యకర్తల అరెస్టులపై శ్రీరెడ్డి సెల్ఫీ వీడియో... కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా తప్పుడు పోస్టులు పెట్టి అరెస్టైన వారిలో వైసీపీకి చెందిన కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో... శ్రీరెడ్డి స్పందించారు.
By: Tupaki Desk | 9 Nov 2024 5:28 AM GMTసోషల్ మీడియా మహిళలు, నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న, వ్యక్తిత్వ హననాలకు పాల్పడూ పోస్టులు పెడుతున్నవారికి ఏపీ సర్కార్ బిగ్ షాకిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తప్పుడు పోస్టులు పెట్టి అరెస్టైన వారిలో వైసీపీకి చెందిన కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో... శ్రీరెడ్డి స్పందించారు.
అవును... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలువురు సినీ ప్రముఖులు, వారి పిల్లలు, రాజకీయ నాయకులపై ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు, ఆరోపణలు శృతిమించిన సందర్భాలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో! ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేస్తోన్న వేళ ఆమె స్పందించారు.
ఇందులో భాగంగా... సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై స్పందించిన ఆమె.. వాళ్ల ఇబ్బందుల గురించి చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో... "మీరు సమ ఉజ్జీలతో ఫైట్ చేయాలి.. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు.. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతూ.. శరణు అన్నవారిని కూడా వదిలిపెట్టకుండా అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు" అని అన్నారు.
ఇదే సమయంలో... "ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు" అని విజయమ్మ చెప్పారు కదా అని అడిగిన శ్రీరెడ్డి... ఫైట్ చేయాలనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి కానీ, చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో ఫైట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. దీనివల్ల అమెరికా నుంచి, లండన్ నుంచి ఇంకా కొన్ని చోట్ల నుంచి కార్యకర్తలు పొట్టుకొస్తారని తెలిపారు.
ఇప్పుడున్న వాళ్లు లోకల్ గా ఉన్నారు కాబట్టి వాళ్లను పట్టుకుని కుల్లబొడుస్తున్నారని.. కూటమి ప్రభుత్వ వచ్చాక పలువురు సోషల్ మీడియా కన్వీనర్ లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని తెలిపారు. గతంలో వైఎస్ భారతిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటూ పవన్ ని ప్రశ్నించారు శ్రీరెడ్డి.
నాడు జగన్ పైనా, భారతి పైనా అసహ్యంగా, అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్లు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంచి మంచి పొజిషన్స్ లోకి వచ్చారని ఆమె తెలిపారు. అయితే... వైసీపీలో మాత్రం కార్యక్రలను జగన్ వరకూ వెళ్లనీయకుండా చాలా మంది మధ్యలోనే తొక్కేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు హోంమంత్రిగా ఉన్న అనిత, నాడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. సాక్ష్యాత్తు సీఎం జగన్ పై తీవ్ర అభ్యంతరకరమైన పదాలు ఉపయోగిస్తూ, వ్యక్తిత్వ హనానైకి పాల్పడ్డారని చెప్పిన శ్రీరెడ్డి.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మాత్రం క్రిమినల్స్ అయిపోయారా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో... తనను తన కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నారని, తన వల్ల ఫ్యామిలీలో ఆడపిల్లలకు పెళ్లిల్లు అవ్వడం లేదని.. ఇక జైలుకు కూడా వెళ్తే ఇక అంతే సంగతులని తనకు చెప్పారని చెప్పిన శ్రీరెడ్డి... "నేను సారీ మావళ్ల గురించి చెప్పడం కాదు... పవన్, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు.. అలాగే మీ సోషల్ మీడియా వాళ్లకు.. మీ మీడియా వాళ్లకు.. అందరికీ సారీ" అని చెప్పారు.