శ్రీరెడ్డిపై వరుస కేసులు.. ఎక్కడెక్కడంటే..?
ఇప్పటికే పలువురిపై కేసులు నమోదవ్వగా.. తాజాగా నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదయ్యాయి!
By: Tupaki Desk | 13 Nov 2024 7:51 AM GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన, తప్పుడు కామెంట్లు చేసిన వారిపై వరుసగా నమోదవుతున్న కేసుల వ్యవహారం! ఈ సందర్భంగా... ఇప్పటికే పలువురిపై కేసులు నమోదవ్వగా.. తాజాగా నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదయ్యాయి!
అవును... గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లతోపాటు వంగలపూడి అనిత పై నటి శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు శ్రీరెడ్డినీ చేరాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్, లోకేష్, వంగలపూడి అనితలపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోరంపూడికి చెందిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ.. రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు!
మరోపక్క అనకాపల్లిలోనూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గానూ శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, వసంత ఫిర్యాదు చేశారు.
కాగా... ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో దాదాపు ఇదే అంశంపై సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు అందించారు. మరోపక్క పోసాని కృష్ణమురళిపై అటు విజయవాడ, ఇటు రాజమండ్రిలో ఫిర్యాదులు అందాయని అంటున్నారు.