Begin typing your search above and press return to search.

ఫోన్ లో "ఓకే" అన్న పదం... ఈయన జీవితాన్ని బొంగరంలా తిప్పేసింది!

తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ చెప్పిన "ఒకే" అనే మాట.. రైల్వే డిపార్ట్ మెంట్ కి కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టింది.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:01 AM GMT
ఫోన్  లో ఓకే అన్న పదం... ఈయన జీవితాన్ని  బొంగరంలా తిప్పేసింది!
X

ఫోన్ లో మాట్లాడేటప్పుడు.. ప్రధానంగా డ్యూటీ టైమింగ్స్ లో కాల్స్ మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ బుక్ రాయగల స్థాయి ఘటన తాజాగా తెరపైకి వచ్చింది! ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం తెరపైకి వచ్చింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ చెప్పిన "ఒకే" అనే మాట.. రైల్వే డిపార్ట్ మెంట్ కి కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టింది.

అవును... డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ లు మాట్లాడటం వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయని బాస్ లు చాలా మందికి చాలా సందర్భాల్లో చెప్పే ఉంటారు! ఏదైనా స్వానుభవంలోకి వస్తేగాని తెలియదు అని కూడా అంటారు. ఈ సమయంలో... నైట్ డ్యూటీలో ఉండి స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తోన్న వ్యక్తికి భార్య నుంచి కాల్ రావడం, అతడు రిసీవ్ చేసుకుని "ఓకే" అనడంతో రైల్వేస్ కి రూ.3 కోట్ల నష్టం వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఏపీలోని విశాఖపట్ననికి చెందిన ఓ స్టేషన్ మాస్టర్ కు ఛతీస్ గఢ్ కు చెందిన ఓ మహిళతో 2011లో వివాహమైంది. ఈ క్రమంలో తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే విషయం.. పెళ్లైన కొద్దిరోజులకే అతడికి తెలిసిందంట. దీంతో.. తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేవి!

ఈ క్రమంలో 2012 మార్చి 22న రాత్రి సమయంలో స్టేషన్ మాస్టర్ విధులు నిర్వహిస్తోన్న క్రమంలో... అతని భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. దీంతో.. కాల్ రిసీవ్ చేసుకున్న స్టేషన్ మాస్టర్... "ఇంటికి వచ్చాక మాట్లాడతాను.. ఓకే" అని ఫోన్ పెట్టేశాడట. అయితే... ఈ మాటలు ఛతీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కమలూర్ రైల్వే స్టేషన్ లో పని చేస్తోన్న వ్యక్తికి చేరాయంట.

దీంతో... స్టేషన్ మాస్టర్ "ఓకే" చెప్పేశారు కదా అని, రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. దీంతో... మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ జిల్లాలోని ప్రాంతంలో.. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య నిర్ణయించబడిన నిషేధిత సమయంలో రైలు బయలుదేరింది. అయితే... ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు కానీ.. రైల్వేకు మాత్రం రూ.3 కోట్ల వరకూ నష్టం వచ్చిందంట.

దీంతో... సదరు స్టేషన్ మాస్టార్ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే... తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఛతీస్ గఢ్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించిందంట. దీంతో... హైకోర్టుని ఆశ్రయించడం.. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగిపోయాయని అంటున్నారు! అలా... "ఒకే" అనే పదం ఇతడి జీవితాన్ని చాలా మలుపులు తిప్పేసిందన్నమాట!