Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్‌కు ఆ ఎమ్మెల్యే గుడ్ బై.. కులం ఓట్ల లెక్క త‌ర్వాతే నిర్ణ‌యం!?

రాజ‌య్య కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరందుకున్న‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని అంశాలు అడ్డ‌కింగా మారిన‌ట్లు చెప్తున్నారు

By:  Tupaki Desk   |   30 Sep 2023 3:57 AM GMT
బీఆర్ఎస్‌కు ఆ ఎమ్మెల్యే గుడ్ బై.. కులం ఓట్ల లెక్క త‌ర్వాతే నిర్ణ‌యం!?
X

తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్ పార్టీకి మ‌రోమారు షాక్ త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల టికెట్ల జాబితాలో నిరాశ ఎదుర్కున్న స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య ఈ మేర‌కు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం త్వ‌ర‌లోనే ఖ‌రారు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా టికెట్ల కేటాయింపు ర‌చ్చ‌లో వార్త‌ల్లో నిలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌లో మ‌రో చోట సిట్టింగ్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ కోల్పోనుంది. అయితే, రాజ‌య్య ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ప‌క్కా లెక్క‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాద‌ని అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత క‌డియం శ్రీ‌హ‌రికి కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ ప‌డే చాన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం ప‌ట్ల‌ హ‌ర్ట‌యిన రాజ‌య్య త‌న అసంతృప్తిని బ‌హిరంగంగానే వ్య‌క్తం చేశారు. దీంతో ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిని ప్రగతి భవన్ కు పిలిపించుకుని గెలుపుకోసం పనిచేయాలని రాజయ్యకు సూచించారు. భవిష్యత్తులో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఆశ చూపారు. అయితే, వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నుకున్న ద‌శ‌లో ట్విస్ట్ చోటుచేసుకుంది.

కేటీఆర్‌తో స‌మావేశం అనంత‌రం స్టేషన్ ఘన్ పూర్ వెళ్లిన రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలం కలిసి వస్తే తాను ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. దీని వెన‌క రాజ‌య్య వేసుకున్న లెక్క‌లే కార‌ణ‌మ‌ని అంటున్నారు. స్టేషన్ ఘన్ పూర్ సెగ్మెంట్ లో దాదాపు 85 వేల ఎస్సీ ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 70 వేల వరకు ఉంటాయి. అవన్నీ గంపగుత్తగా తనకేపడుతాయనే భరోసాతో ఉన్న రాజయ్య ఈ మేర‌కు పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కాంగ్రెస్ ముఖ్య నేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సిమహాతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి బలమైన భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లుసమాచారం.

రాజ‌య్య కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరందుకున్న‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని అంశాలు అడ్డ‌కింగా మారిన‌ట్లు చెప్తున్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇందిర టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మ‌రోవైపు రాజ‌య్య ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీలో చేర‌లేదు. దీంతో ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఉత్కంఠ కాంగ్రెస్‌ వ‌ర్గాల్లో నెల‌కొంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజ‌య్య‌ ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని స్పష్టమైన హామీ వస్తే ఆయన హ‌స్తం గూటికి చేరడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.