Begin typing your search above and press return to search.

ఒక్క ఫోన్‌.. ఒకే ఒక్క ఫోన్‌.. 400 మంది జీవితాల‌ను అగాధంలోకి నెట్టేసింది!

దీంతో ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఇది వారి జీవితాల‌ను ఛిద్రం చేస్తున్న‌దనే నివేదిక‌లు కూడా వ‌స్తున్నాయి

By:  Tupaki Desk   |   26 March 2024 7:00 AM GMT
ఒక్క ఫోన్‌.. ఒకే ఒక్క ఫోన్‌.. 400 మంది జీవితాల‌ను అగాధంలోకి నెట్టేసింది!
X

ఒక్క ఫోన్ కాల్‌.. ఒకే ఒక్క ఫోన్ కాల్‌.. వంద‌ల మంది జీవితాల‌ను నాశ‌నం చేస్తుంద‌ని.. స‌డెన్‌గా వారి జీవితా ల‌ను అగాధంలోకి నెట్టేస్తుంద‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? కానీ.. జ‌రిగింది! ప్ర‌స్తుతం ఐటీ కంపెనీల్లో ఉద్యో గాలు అంటేనే తామ‌రాకుపై నీటి బొట్టులా మారాయి. ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌తాయో.. ఎప్పుడు రాలిపోతాయో .. తెలియ‌ని ప‌రిస్థితిగా మారింది. లే ఆఫ్‌లు ప్ర‌క‌టిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఇది వారి జీవితాల‌ను ఛిద్రం చేస్తున్న‌దనే నివేదిక‌లు కూడా వ‌స్తున్నాయి.

తాజాగా ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ ఒక్క ఫోన్ కాల్‌తో అమెరికాలోని తమ ఇంజినీ రింగ్, టెక్నాలజీ డివిజన్‌లోని 400 మంది ఉద్యోగులను తీసేసింది. ఇటాలియ‌న్ అమెరిక‌న్ ఆటోమేక‌ర్ అయిన స్టెల్లాంటిస్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే.. ఈ సంస్థ ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి కొన్నాళ్లుగా వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కంపెనీ షేర్లు కూడా న‌ష్టాల బాట‌లోనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 400 మంది ఉద్యోగుల‌కు గుండెలు ఆగినంత ప‌నైంది. ఎందుకంటే ఈ కంపెనీ ఇచ్చే జీత‌భ‌త్యాల‌తో వారు అనేక వ‌స్తువులు, ఇళ్లు కొనుగులుచేశారు. దీంతో నెల తిరిగే పాటికి వారు ఈఎంఐల రూపంలో చెల్లించా ల్సి ఉంటుంది. ఇప్పుడు అవ‌న్నీ ఆగిపోతే.. త‌మ జీవితాలు ఏంటని వారు చ‌ర్చించుకుంటున్నారు.

ఔట్ సోర్సింగ్ చూసుకుని!

స్లెల్లాంటిస్‌కు భార‌త్‌, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారు సమర్థవంతంగా పనిచేస్తుండడంతో పాటు త‌క్కువ వేత‌నాల‌కే చేస్తున్నారు. దీంతో వారిని చాల‌ని అనుకున్న కంపెనీ.. రెగ్యులర్ ఉద్యోగులను తొలగించింది. అయితే, తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో పంపడం లేదని, పరిహార ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు తెలిపింది. ఆటో ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.