Begin typing your search above and press return to search.

బంగారం, మొబైల్ ఫోన్ల "కస్టమ్స్" కు గుడ్ న్యుస్!

అవును... నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

By:  Tupaki Desk   |   23 July 2024 9:35 AM GMT
బంగారం, మొబైల్  ఫోన్ల  కస్టమ్స్ కు గుడ్  న్యుస్!
X

ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ లో కొన్ని వరాలు ప్రకటించారు నిర్మాలా సీతారామన్. ఇందులో భాగంగా పన్ను విధానంలో వేతన జీవులకు స్వల్ప ఊరటనిచ్చిన ప్రభుత్వం... తాజాగా బంగారం, ప్లాటినం లతో పాటు బేసిక్ మొబైల్స్ ఫోన్స్ ధరలు తగ్గుముఖం పట్టే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అవును... నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... ప్రస్తుతం గ్రాము రూ.7,000 దాటిపోయిన బంగారంపై కొంత ఊరట కల్పించారు. ఇది భారత్ వంటి దేశాల్లో మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదే సమయంలో ధనవంతులు మాత్రమే ధరించే ప్లాటినం ధరలు కూడా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా.. బంగారం పై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి.. ఇదే క్రమంలో ప్లాటినం పై కస్టమ్ డ్యూటీని 6.4 శాతానికీ తగ్గించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా.. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇదే సమయంలో బేసిక్ మొబైల్ ఫోన్లపైనా ప్రస్తుతం ఉన్న కస్టమ్ డ్యూటీనీ తగ్గించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.

దీనివల్ల దేశంలో ప్రస్తుతం స్టార్టప్ లకు కేంద్రంగా ఉన్న మొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు.. ఈ వ్యాపారంలో ఉన్న 26% మంది యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు!

ఇదే క్రమంలో... ఇండస్ట్రియల్ ఏరియాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్... ఇందులో భాగంగా... పారిశ్రామిక కేంద్రాల్లో కార్మికుల నివాసాల కోసం డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఫలితంగా వలస కూలీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసినట్లవుతుందని వివరించారు.