Begin typing your search above and press return to search.

50 ఏళ్ల క్రితం స్టీవ్ రాసిన లేఖ అంత ధర పలికింది

ఈ కుంభమేళాకు హాజరయ్యేందుకు కోట్లాది మంది యూపీ వైపు అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:18 AM GMT
50 ఏళ్ల క్రితం స్టీవ్ రాసిన లేఖ అంత ధర పలికింది
X

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా ఇప్పుడు మహా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభ మేళాకు.. ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. ఇప్పుడు నిర్వహిస్తున్న మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ కుంభమేళాకు హాజరయ్యేందుకు కోట్లాది మంది యూపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు కోట్ల మందికి పైనే మహాకుంభమేళాకు హాజరైన సంగతి తెలిసిందే.

ఈ మహా కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో బాబాలు.. ప్రముఖులు వస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ సతీమణి.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన అంశం పెద్ద చర్చకు తెర తీసింది. అంతేకాదు.. మహాకుంభమేళకు వచ్చిన దివంగత స్టీవ్ సతీమణి పావెల్ జాబ్స్ తన పేరును కమలగా మార్చుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా యాభై ఏళ్ల క్రితం స్టీవ్ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖను సొంతం చేసుకోవటానికి భారీ పోటీ నెలకొంది.

దీన్ని వేలంలో రూ.4.32 కోట్ల ధర పలికింది. ఈ లేఖలో భారత్ లో జరిగే కుంభమేళా ప్రస్తావనతో పాటు..తాను ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేయటం కనిపిస్తోంది. 1974లో తన స్నేహితుడికి రాసిన మొదటి లేఖగా పేర్కొంటున్నారు. ఈ లేఖను బోన్ హామ్స్ వేలం వేసింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. స్టీవ్ రాసిన మొదటి లేఖగా చెబుతున్నారు. ఈ కారణంతోనే దీనికి భారీ డిమాండ్ పేర్కొందని చెబుతున్నారు.

తన పందొమ్మిదో పుట్టన రోజుకుఒక రోజు ముందు స్టీవ్ తన చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్ కు ఈ లేఖ రాశారు. అందులో ఆయన ఆధ్యాత్మిక.. ఆత్మపరిశీలనకు సంబంధించి చాలానే అంశాల్ని వెల్లడించారు. బౌద్ధ మతం ప్రస్తావనతో పాటు.. కుంభమేళా కోసం భారత్ కు వెళ్లాలని తాను అనుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నారు. తాజాగా కమల రాకతో ఆయన కోరిక ఒకటి తీర్చినట్లుగా భావిస్తున్నారు.

ఏప్రిల్ లో ప్రారంభమయ్యే కుంభమేళాకు తాను భారత్ కు వెళుతున్నట్లుగా లేఖలో పేర్కొన్న ఆయన.. అందులో భాగంగా తొలుత ఉత్తరాఖండ్ లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే.. ఆయన నైనిటాల్ కు చేరుకోగానే నీమ్ కరోలి బాబా అంతకు ముందు ఏడాదే మరణించినట్లుగా తెలుసుకున్నారు. దీంతో ఆయన కైంచి ధామ్ లోని ఆశ్రమంలోఉండి నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు స్టీవ్ సతీమణి సైతం నిరంజినీ అఖారా క్యాంప్ లోనే ఉన్న సంగతి తెలిసిందే.