Begin typing your search above and press return to search.

మొహం చూసి.. ఒత్త‌డి చెప్పేస్తుంది: ఏఐ సంచ‌లన టూల్‌

యువ‌త నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అంద‌రికీ ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య ఒత్తిడి

By:  Tupaki Desk   |   3 March 2024 4:30 PM GMT
మొహం చూసి.. ఒత్త‌డి చెప్పేస్తుంది:  ఏఐ సంచ‌లన టూల్‌
X

యువ‌త నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అంద‌రికీ ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య ఒత్తిడి. విష‌యం ఏదైనా డిప్రెష‌న్‌కు గుర‌వుతున్న వారి సంఖ్య స‌మాజంలో పెరుగుతోంది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు చాలా స్వ‌ల్పంగా ఉంటే.. మాద‌క‌ద్ర‌వ్యాల బారిన ప‌డుతున్న‌వారు కూడా ఉండ‌డం స‌మాజాన్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. అంతేకాదు.. చాలా మంది ఇటీవ‌ల కాలంలో ఆత్మ‌హ‌త్య‌ల బారిన కూడా ప‌డుతున్నారు. ఇక‌, మ‌ద్యానికి, సిగ‌రెట్ల‌కు అల‌వాటు ప‌డుతున్న‌వారు కూడా చెప్పే మాట ``ఒత్తిడి త‌ట్టుకోలేక పోతున్నాం బ్రో!`` అనే!

సో.. మొత్తాని ఈ ఒత్తిడి అనేది.. ప్ర‌తి ఒక్క‌రూ అనుభ‌విస్తున్న ప్ర‌ధాన రుగ్మ‌త‌. ఈ నేపథ్యంలో పరిశోధకు లు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. మీరు జస్ట్ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తే చాలు.. వెంటనే మీ ముఖం చూసి మీ పరిస్థితిని పసిగట్టేస్తుంది. డిప్రెషన్‌లో ఉంటే అలర్ట్ చేస్తుంది. ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో పనిచేస్తుంది. మీ ముఖకవళికల ఆధారంగా, డిప్రెషన్‌ను గుర్తిస్తుంది.

`మూడ్ క్యాప్చర్` అనే ఈ యాప్ ఫోన్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి, యూజర్ ముఖం, చుట్టుపక్కల వాతావరణం పరిశీలించి, డిప్రెషన్ లక్షణాలను గుర్తిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నట్లయితే.. వెంటనే చెప్పేస్తుంది. త‌ద్వారా బాధితుడు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ 75% డిప్రెషన్ లక్షణాలను త్వరగా గుర్తించినట్టు తేలింది. `ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి దీనిని రూపొందించారు.

సూచ‌న‌లు కూడా..

`మూడ్ క్యాప్చర్` యూజర్... డిప్రెషన్ లక్షణాలను గుర్తించిన తర్వాత, డిప్రెషన్ ఉన్నట్టు ఆ యూజర్ కు చెప్పి భయపెట్టకుండా, కాసేపు అలా బయట తిరిగి రమ్మని, ఫ్రెండ్స్ తో మాట్లాడమని పరిస్థితికి తగినట్లు సూచనలు చేస్తుంది. మీకు డిప్రెషన్ ఉందని మీరు గుర్తించక ముందే, అడ్వాన్స్‌డ్‌ ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ యాప్ గుర్తించి పరిస్థితి చేజారి పోకముందే అప్రమత్తం చేస్తుంది. మొత్తానికి ఏఐతో ప్ర‌మాదాలు పొంచి ఉన్నాయ‌ని భావించే వారికి ఇది ఒక కీల‌క అవ‌స‌రంగా మార‌నుంది.