మూడో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య... షాకింగ్ వీడియో!
అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
By: Tupaki Desk | 23 Jan 2025 10:11 AM GMTఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అందరితో పాటు క్లాసులో కూర్చున్న వ్యక్తి ఉన్నపలంగా తనకు తాను లేచి నడుచుకుంటూ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూడకుండా మౌనంగా తానున్న మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకిన ఘటన తీవ్ర షాకింగ్ గా మారింది.
అవును... అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఏపీలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల పై మరోసారి కీలక తెరపైకి వచ్చిందని అంటున్నారు.
గురువారం అందరితోపాటు కళాశాలకు వచ్చిన చరణ్.. క్లాస్ నడుస్తండగా.. అందరూ చూస్తుండగా.. మౌనంగా బయటకు నడుచుకుంటు వచ్చాడు. ఈ సమయంలో అనుమతి తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అన్నట్లుగా క్లాస్ లో ఉన్న లెక్చరర్ చుసి, అనంతరం తన ఛైర్ లో ఆయన కూర్చున్నారు.
దీంతో అతడు మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేసరికి.. క్లాస్ లోని విద్యార్థులంతా బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో తీవ్రంగా గాయపడ్డ చరణ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే... విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.